#BoycottLiger: ట్రెండింగ్​లో బాయ్​కాట్​ లైగర్​.. విజయ్​ దేవరకొండే కారణమా?

బాయ్​కాట్​.. బాయ్​కాట్​.. బాయ్​కాట్​.. బాలీవుడ్​ డోంట్​ లైక్​ ఇట్​ అండ్​ అవైడ్​.. బట్​ బాయ్​కాట్​ లైక్స్​ బాలీవుడ్​ అన్నట్లుగా ఉంది హింది చిత్రసీమ పరిస్థితి. ఇటీవల కాలంలో బాలీవుడ్​ నుంచి ఏ సినిమా వచ్చిన దాన్ని బాయ్​కాట్​ చేయాలని సోషల్​ మీడియాలో నెటిజన్లు హల్​చల్​ చేస్తున్న విషయం తెలిసిందే. బాయ్​కాట్​బాలీవుడ్​ అనే హ్యాష్​ట్యాగ్​ ట్విటర్​లో తెగ ట్రెండ్​ అయింది. అమీర్​ ఖాన్​ లాల్ సింగ్​ చడ్డా, అక్షయ్​ కుమార్ రక్షా బంధన్​, తాప్సీ దోబారా తదితర హిందీ చిత్రాలు ఈ ట్రెండ్ బారిన పడిన సంగతి తెలిసిందే. సౌత్​ సినిమాలను మెచ్చుకుంటూ బాలీవుడ్​ మూవీస్​ను విమర్శించిన బాయ్​కాట్​ ట్రెండ్ తాజాగా టాలీవుడ్​కు పాకింది.

రౌడీ హీరో విజయ్​ దేవరకొండ, డ్యాషింగ్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​ కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం లైగర్. మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​ మూవీగా రూపొందిన ఈ మూవీ తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్​ ఇండియాగా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న గ్రాండ్​గా విడుదల కానుంది.

ఐదు రోజుల్లో రిలీజ్​..

ఐదు రోజుల్లో రిలీజ్​..

ఇప్పటివరకు బాలీవుడ్​ సినిమాలను విమర్శిస్తూ సౌత్​ మూవీస్​ను ప్రశంసించిన నెటిజన్లు తాజాగా లైగర్​ సినిమాను కూడా బాయ్​కాట్​ చేయాలని ట్రెండ్​ చేస్తున్నారు. దీంతో మరో ఐదు రోజుల్లో విడుదలకు సిద్ధంగా లైగర్​ చిత్ర బృందానికి షాక్ తలిగినట్లు అయింది.

నిర్మాతే కారణం!

నిర్మాతే కారణం!

అయితే లైగర్​ సినిమాను బాయ్​కాట్​ చేయాలనుకోవడానికి కారణం ఆ మూవీ ప్రోడ్యూసరే. లైగర్​ సినిమా నిర్మాతల్లో ప్రముఖ హిందీ దర్శనిర్మాత కరణ్​ జోహర్​ కూడా ఒకరు. ధర్మ ప్రొడక్షన్స్​ బ్యానర్​పై ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మీద ఉన్న కోపంతోనే లైగర్​కు బాయ్​కాట్​ సెగ తగిలింది.

సుశాంత్​ సింగ్​ మరణం తర్వాత..

సుశాంత్​ సింగ్​ మరణం తర్వాత..

గతంలో సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​ మరణం తర్వాత ఈ బాయ్​కాట్ బాలీవుడ్​ ట్రెండ్ బాగా వినిపించింది. హిందీ కథానాయకులు ఎవరు కూడా సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేయలేదని, ఆయన మరణించడానికి బాలీవుడ్​ హీరోలు, నెపొటిజంను ప్రోత్సహించే కరణ్​ జోహర్​ వంటి దర్శకనిర్మాతలే కారణమని నెటిజన్లు విమర్శించారు.

లాల్ సింగ్​ చడ్డా, రక్షా బంధన్​ కుదేలు..

లాల్ సింగ్​ చడ్డా, రక్షా బంధన్​ కుదేలు..

దీంతో హిందీ సినిమాలను, కరణ్​ జోహార్​ సినిమాలను బాయ్​కాట్​ చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ బాయ్​కాట్​ సెగ తగిలిన లాల్​ సింగ్​ చడ్డా, రక్షా బంధన్​, పృథ్వీరాజ్​ చౌహన్​ కలెక్షన్లు ఎలా ఉన్నాయే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా రణ్​బీర్​ కపూర్​ బ్రహ్మాస్త్ర సినిమా కూడా ఈ ట్రెండ్​ బారిన పడింది.

హీరోయిన్​ కూడా..

హీరోయిన్​ కూడా..

అయితే లైగర్​ సినిమాకు కరణ్ జోహార్​ నిర్మాతగా వ్యవహరించడం ఒక కారణమైతే, అందులోని హీరోయిన్​ అనన్య పాండే మరో కారణం. ఎందుకంటే బాలీవుడ్​ సీనియర్​ నటుడు చుంకీ పాండే కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్​ అయిన అనన్య ఇప్పుడు టాలీవుడ్​కు పరిచయం కానుంది.

కరణ్​ ఆశీస్సులు..

కరణ్​ ఆశీస్సులు..

మిగతా హీరోయిన్స్​ కంటే ఆమెకు కరణ్​ జోహార్​ ఆశీస్సులు ఎక్కువగా ఉన్నాయని టాక్​. ఇక ఆమెపై ఉన్న కోపం లైగర్​ సినిమాకు మళ్లిందని కూడా చెప్పవచ్చు. ఇంకా ఈ బాయ్​కాట్​కు మరో కారణం హీరో విజయ్​ దేవరకొండ అని కూడా చెప్పుకుంటున్నారు. ఇటీవల లాల్​ సింగ్​ చడ్డా సినిమా బాయ్​కాట్​పై విజయ్​ కామెంట్​ చేశాడు.

సంబంధం లేని లాజిక్​లు..

సంబంధం లేని లాజిక్​లు..

ఇలా బాయ్​కాట్​ చేయడం వల్ల సినీ కార్మికులు నష్టపోతారని అనడంతో, సినిమా రిలీజ్​కు ముందే వాళ్లకు పేమెంట్​ ఇచ్చేస్తారు కదా. వాళ్లు నష్టపోయేది ఏముంది? ఇలా అమీర్​ ఖాన్​ను సపోర్ట్​ చేయడానికి సంబంధం లేని లాజిక్​లు తీసుకొస్తున్నాడని విమర్శించారు. సో ఇలాంటివే కాకుండా మరికొన్ని కారణాలతో కూడా లైగర్​ను బాయ్​కాట్​ చేయాలని ట్రెండ్​ చేస్తున్నారని టాక్​ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X