Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
#BoycottLiger: ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ లైగర్.. విజయ్ దేవరకొండే కారణమా?
బాయ్‌కాట్.. బాయ్‌కాట్.. బాయ్‌కాట్.. బాలీవుడ్ డోంట్ లైక్ ఇట్ అండ్ అవైడ్.. బట్ బాయ్‌కాట్ లైక్స్ బాలీవుడ్ అన్నట్లుగా ఉంది హింది చిత్రసీమ పరిస్థితి. ఇటీవల కాలంలో బాలీవుడ్ నుంచి ఏ సినిమా వచ్చిన దాన్ని బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. బాయ్కాట్బాలీవుడ్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో తెగ ట్రెండ్ అయింది. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్, తాప్సీ దోబారా తదితర హిందీ చిత్రాలు ఈ ట్రెండ్ బారిన పడిన సంగతి తెలిసిందే. సౌత్ సినిమాలను మెచ్చుకుంటూ బాలీవుడ్ మూవీస్‌ను విమర్శించిన బాయ్‌కాట్ ట్రెండ్ తాజాగా టాలీవుడ్‌కు పాకింది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లైగర్. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీగా రూపొందిన ఈ మూవీ తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియాగా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఐదు రోజుల్లో రిలీజ్..
ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలను విమర్శిస్తూ సౌత్ మూవీస్‌ను ప్రశంసించిన నెటిజన్లు తాజాగా లైగర్ సినిమాను కూడా బాయ్‌కాట్ చేయాలని ట్రెండ్ చేస్తున్నారు. దీంతో మరో ఐదు రోజుల్లో విడుదలకు సిద్ధంగా లైగర్ చిత్ర బృందానికి షాక్ తలిగినట్లు అయింది.
నిర్మాతే కారణం!
అయితే లైగర్ సినిమాను బాయ్‌కాట్ చేయాలనుకోవడానికి కారణం ఆ మూవీ ప్రోడ్యూసరే. లైగర్ సినిమా నిర్మాతల్లో ప్రముఖ హిందీ దర్శనిర్మాత కరణ్ జోహర్ కూడా ఒకరు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మీద ఉన్న కోపంతోనే లైగర్‌కు బాయ్‌కాట్ సెగ తగిలింది.
సుశాంత్ సింగ్ మరణం తర్వాత..
గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఈ బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ బాగా వినిపించింది. హిందీ కథానాయకులు ఎవరు కూడా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేయలేదని, ఆయన మరణించడానికి బాలీవుడ్ హీరోలు, నెపొటిజంను ప్రోత్సహించే కరణ్ జోహర్ వంటి దర్శకనిర్మాతలే కారణమని నెటిజన్లు విమర్శించారు.
లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ కుదేలు..
దీంతో హిందీ సినిమాలను, కరణ్ జోహార్ సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ బాయ్‌కాట్ సెగ తగిలిన లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్, పృథ్వీరాజ్ చౌహన్ కలెక్షన్లు ఎలా ఉన్నాయే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా రణ్‌బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర సినిమా కూడా ఈ ట్రెండ్ బారిన పడింది.
హీరోయిన్ కూడా..
అయితే లైగర్ సినిమాకు కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించడం ఒక కారణమైతే, అందులోని హీరోయిన్ అనన్య పాండే మరో కారణం. ఎందుకంటే బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన అనన్య ఇప్పుడు టాలీవుడ్‌కు పరిచయం కానుంది.
కరణ్ ఆశీస్సులు..
మిగతా హీరోయిన్స్ కంటే ఆమెకు కరణ్ జోహార్ ఆశీస్సులు ఎక్కువగా ఉన్నాయని టాక్. ఇక ఆమెపై ఉన్న కోపం లైగర్ సినిమాకు మళ్లిందని కూడా చెప్పవచ్చు. ఇంకా ఈ బాయ్‌కాట్‌కు మరో కారణం హీరో విజయ్ దేవరకొండ అని కూడా చెప్పుకుంటున్నారు. ఇటీవల లాల్ సింగ్ చడ్డా సినిమా బాయ్‌కాట్‌పై విజయ్ కామెంట్ చేశాడు.
సంబంధం లేని లాజిక్‌లు..
ఇలా బాయ్‌కాట్ చేయడం వల్ల సినీ కార్మికులు నష్టపోతారని అనడంతో, సినిమా రిలీజ్‌కు ముందే వాళ్లకు పేమెంట్ ఇచ్చేస్తారు కదా. వాళ్లు నష్టపోయేది ఏముంది? ఇలా అమీర్ ఖాన్‌ను సపోర్ట్ చేయడానికి సంబంధం లేని లాజిక్‌లు తీసుకొస్తున్నాడని విమర్శించారు. సో ఇలాంటివే కాకుండా మరికొన్ని కారణాలతో కూడా లైగర్‌ను బాయ్‌కాట్ చేయాలని ట్రెండ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.