Liger IMDB Rating: IMDB రేటింగ్​లో రికార్డు క్రియేట్​ చేసిన లైగర్​ మూవీ..

టాలీవుడ్​లో మాస్​ డైరెక్టర్​గా పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. అలాగే రౌడీ హీరోగా క్రేజ్​ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. వీరిద్దరి కాంబినేషన్​లో ఫస్ట్​ టైమ్ వచ్చిన మూవీ లైగర్. మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​ నేపథ్యంలో లైగర్​ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 25న వరల్డ్​వైడ్​గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్​ ఇండియా సినిమాగా విడుదలైంది. అయితే అంచనాలకు భిన్నంగా లైగర్​ మిక్స్​డ్​ టాక్​ను తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో ఐమీడీబీ సంస్థ లైగర్​ మూవీకి ఇచ్చిన రేటింగ్​ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రముఖ బాలీవుడ్​ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా లైగర్​ సినిమా నిర్మించారు. టాలీవుడ్​లో మాస్​ డైరెక్టర్​ పూరి, క్రేజీ హీరోగా విజయ్ దేవరకొండ కాంబినేషన్​లో ఓ మూవీ వస్తుందనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

బాలీవుడ్​ భామతో..

బాలీవుడ్​ భామతో..

ఇక ఆ మూవీకి లైగర్​ అని టైటిల్​ డిక్లేర్​ చేయడం, అందులో లెజండరీ బాక్సర్​ మైక్​ టైసన్​ నటించడంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా ఇందులో బాలీవుడ్​ ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్​ అనేసరికి అదనపు ఆకర్షణ తోడైంది.

అదిరిపోయిన రెస్పాన్స్..

అదిరిపోయిన రెస్పాన్స్..

వీటన్నింటితో పాటు సినిమా టీజర్​, పోస్టర్స్​, సాంగ్స్​, ట్రైలర్​ మరింత క్రేజ్​ తీసుకొచ్చాయి. ఇక ఈ సినిమా కోసం చేసిన ప్రమోషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. విజయ్​ దేవరకొండ, అనన్య పాండే ఎక్కడికి వెళ్లిన అక్కడ రెస్పాన్స్ అదిరిపోయింది.

విజయ్ వ్యాఖ్యలు..

విజయ్ వ్యాఖ్యలు..

అలాగే వరంగల్​లో నిర్వహించిన ఫ్యాన్​డమ్​ ఈవెంట్​కు, గుంటూరులో జరిగిన ప్రీరిలీజ్​ ఈవెంట్​తో హైప్​ మరింత రెట్టింపైంది. ఈ ఈవెంట్​లో విజయ్​ దేవరకొండ చెప్పిన మాటలు అంతా త్వరగా ఎవరు మర్చిపోలేరు. ఆగస్టు 25న ఇండియా షేక్ కాబోతుందన్న విజయ్​ వ్యాఖ్యలతో సినిమా సూపర్ హిట్ అని టాక్​ నడిచింది.

పూరీనే డైరెక్ట్​ చేశాడా?

పూరీనే డైరెక్ట్​ చేశాడా?

కానీ, ఆ అంచనాలన్నింటికి భిన్నంగా మిక్స్​డ్​ టాక్​ను సొంతం చేసుకుంది. పూరి మార్క్​ స్టైల్​లో సినిమా లేదని, అసలు మూవీని నిజంగా జగన్నాథ్ తెరకెక్కించాడా? ఇంకైవరికైనా అప్పజెప్పాడా? అని విమర్శలు చేశారు. ఎక్కడా మదర్​ సెంటిమెంట్​ వర్కౌట్ కాలేదని ఓపెన్​గా చెబుతున్నారు.

మౌత్​ టాక్​కు భిన్నంగా..

మౌత్​ టాక్​కు భిన్నంగా..

సినిమాలో ఎలాంటి కథ లేదని, స్క్రీన్​ ప్లే మరింత స్లోగా ఉందని పెదవి విరుస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే మౌత్​ టాక్​కు సంబంధం లేకుండా లైగర్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 13.45 కోట్లను కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది.

దారుణమైన రైటింగ్​..

దారుణమైన రైటింగ్​..

ఇక ఇదిలా ఉంటే ప్రముఖ సినిమా రేటింగ్ సంస్థ ఐఎమ్​డీబీ (ఇంటర్నెట్​ మూవీ డేటాబేస్​) లైగర్​ చిత్రానికి దారుణమైన రేటింగ్ ఇచ్చింది. లైగర్ మూవీకి 10కి కేవలం 1.7 రేటింగ్​ మాత్రమే ఇచ్చింది. ఇటీవల విడుదలై ఫ్లాప్​ టాక్ తెచ్చుకున్న లాల్​ సింగ్​ చద్ధాకు 5, రక్షా బంధన్​కు 4.6, దొబారాకు 2.9 రేటింగ్​ ఇచ్చింది. 2022లో విడుదలై అతి చెత్త రికార్డు మూట గట్టుకున్న చిత్రంగా లైగర్ రికార్డుకెక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X