For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Liger Movie: లైగర్​కు​ ఫ్లాప్ టాక్​ రావడానికి​ 5 ప్రధాన కారణాలు ఇవే..

  |

  టాలీవుడ్ డేరింగ్​ అండ్​ డ్యాషింగ్​ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫస్ట్​ టైమ్​ నటించిన చిత్రం లైగర్​. ప్రముఖ బాలీవుడ్​ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​ నేపథ్యంలో లైగర్​ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 25న వరల్డ్​వైడ్​గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్​ ఇండియా సినిమాగా విడుదలైంది. అయితే అంచనాలకు భిన్నంగా లైగర్​ ఫ్లాప్​ టాక్​ను మూటగట్టుకుంటోంది. అందుకు కారణాలేంటో ఓ లుక్కేద్దామా!

  టాలీవుడ్​లో మాస్​ డైరెక్టర్​ పూరి, క్రేజీ హీరోగా విజయ్ దేవరకొండ కాంబినేషన్​లో ఓ మూవీ వస్తుందనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ మూవీకి లైగర్​ అని టైటిల్​ డిక్లేర్​ చేయడం, అందులో లెజండరీ బాక్సర్​ మైక్​ టైసన్​ నటించడంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. వాటికి తోడు సినిమా పోస్టర్లు, టీజర్​, సాంగ్స్, ట్రైలర్​ మరింత ఊపునిచ్చింది.

   విపరీతమైన రెస్పాన్స్​..

  విపరీతమైన రెస్పాన్స్​..

  ఇక ఈ సినిమా కోసం చేసిన ప్రమోషన్స్ అంతా ఇంతా కాదు. ప్రమోషన్స్​లో భాగంగా విజయ్​ దేవరకొండ, అనన్య పాండే ఏ రాష్ట్రానికి వెళ్లిన విపరీతమైన రెస్పాన్స్​ వచ్చింది. అలాగే ఫ్యాన్​డమ్​ ఈవెంట్​కు, గుంటూరులోని ప్రీరిలీజ్​ ఈవెంట్​తో హైప్​ మరింత పెరిగింది.

   విజయ్​ డైలాగ్​లతో హడావిడి..

  విజయ్​ డైలాగ్​లతో హడావిడి..

  ఈ ఈవెంట్​లలో ఆగస్టు 25న ఇండియా షేక్ కాబోతుంది విజయ్​ దేవరకొండ చెప్పిన డైలాగ్​లు గుర్తుండే ఉంటాయి. దీంతో విజయ్​ దేవరకొండ ఇండియన్​ బాక్సాఫీస్​ను షేక్​ చేయబోతున్నాడు అంటూ ఎంతో హడావిడి నడిచింది.

  టాక్​కు సంబంధం లేకుండా..

  టాక్​కు సంబంధం లేకుండా..

  ఇక ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్​పై ఆడియెన్స్​ పెదవి విరుస్తున్నారు. ​స్క్రీన్​ప్లే స్లోగా ఉందని, అసలు కథే లేదని మొహం చాటేస్తున్నారు. అయితే టాక్​కు సంబంధం లేకుండా తొలిరోజు వరల్డ్​ వైడ్​గా రూ. 13.45 కోట్లను వసూలు చేసింది లైగర్.

  మైనస్​గా తల్లి పాత్ర..

  మైనస్​గా తల్లి పాత్ర..

  అయితే లైగర్​ను ప్రేక్షకులు మెప్పించకపోవడానికి గల 5 కారణాలను ఏంటో చూద్దాం. మొదటగా విజయ్​ తల్లి బాలమణి పాత్రలో రమ్యకృష్ణ నటించడం. రమ్యకృష్ణకు పవర్​ఫుల్​ రోల్​ పడితే అదరగొట్టేస్తారు కానీ లైగర్​లో ఆమె పాత్ర గోలగోలగా ఉందని టాక్​ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండతో మదర్​ సెంటిమెంట్​ సన్నివేశాలు అంతగా పండలేదని తెలుస్తోంది.

  నత్తి పెట్టడంతోనే..

  నత్తి పెట్టడంతోనే..

  ఆమె పాత్రలో ఎమోషన్​కు అంతగా కనెక్ట్​ కాకుండా ఓవర్​ డోస్​ అయిందని వినిపిస్తోంది. రెండో కారణం ఏంటంటే.. విజయ్​కు నత్తి పెట్టడం. అది అంతగా సెట్​ కాలేదు. ఇటీవల సినిమాల్లో హీరోలకు ఏదైనా లోపం ఉంటే స్పెషల్ అట్రాక్షన్​ అవుతోంది. అదే తరహాలో ఆలోచించిన పూరి విజయ్​కు నత్తి పెట్టగా అది కాస్త బెడిసి కొట్టిందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

  ఆకట్టుకోని లవ్​ ట్రాక్​..

  ఆకట్టుకోని లవ్​ ట్రాక్​..

  అయితే విజయ్​ నత్తితో మాట్లాడటం ట్రైలర్​లో బాగానే ఉంది గానీ థియేటర్​లో మాత్రం వర్కౌట్ కాలేదు. ఇక మూడో కారణం.. హీరోయిన్​ అనన్య పాండే. సహజంగానే పూరి సిననిమాల్లో హీరోయిన్ల నుంచి రొమాన్స్​, సాంగ్స్​ తప్ప ఏం ఆశించలేం. అయితే వీళ్లిద్దరి లవ్ ట్రాక్​ కనీసం మూవీని నడిపించే విధంగా లేకపోవడంతో మైనస్​గా మారింది. ఈ సినిమాకు హీరోయిన్​ సీన్స్​ ప్రధాన మైనస్​గా చెప్పుకుంటున్నారు.

   వర్కౌట్​ కానీ మ్యూజిక్​..

  వర్కౌట్​ కానీ మ్యూజిక్​..

  లైగర్​కు పరాజయానికి నాలుగో కారణంగా మ్యూజిక్ అని అంటున్నారు. ఒకటి రెండు పాటలు తప్ప మిగతావి అంతగా ఆకట్టుకోలేదు. అవి కూడా రిపీటెడ్​గా వినేంతగా లేవు. ఈ మూవీకి సునీల్​ కశ్యప్​, విక్రమ్​ సహా పలువురు మ్యూజిక్​ డైరెక్టర్స్​ పనిచేశారు. వారు అందించిన బీజీఎం అంతగా ఆకట్టుకోలేదని కామెంట్స్​ వస్తున్నాయి.

   పెరిగిన హైప్​..

  పెరిగిన హైప్​..

  ఇక చివరిగా చెప్పుకునే ఐదో కారణం సినిమాకు వచ్చిన హైప్​. ఈ సినిమాకు ఊహించని విధంగా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ పెరిగింది. మళ్లీ ఈ మూవీలో లెజండరీ బాక్సర్​ మైక్​ టైసన్​ నటించడం, ప్రమోషనల్స్​లో భాగగా విజయ్​ను బోల్డ్​గా చూపించడం (విజయ్​ దేవరకొండ నగ్నంగా ఉండే పిక్)తో మరింత హైప్​ క్రియేట్ అయింది.

  English summary
  Tollywood Star Director Puri Jagannath And Vijay Devarakonda Combo Movie Liger Getting Mixed Talk Because Of 5 Reasons.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X