Liger Ticket Price: తెలుగు రాష్ట్రాల్లో 'లైగర్'​ టికెట్​ ధరలు ఇవే.. ఎలా ఉన్నాయంటే ?

డ్యాషింగ్​ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫస్ట్​ టైమ్​ నటించిన చిత్రం లైగర్​. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై సంయుక్తంగా పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​ మూవీగా రూపొందిన ఈ మూవీ తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్​ ఇండియాగా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న గ్రాండ్​గా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా టికెట్ ధరలు చర్చనీయాంశమైంది.

దేశవ్యాప్తంగా ప్రమోషన్స్​..

దేశవ్యాప్తంగా ప్రమోషన్స్​..

రౌడీ హీరో విజయ్​ దేవరకొండ, బాలీవుడ్​ బ్యూటీ అనన్య పాండే జోడిగా కలిసి నటించిన చిత్రం లైగర్. పాన్​ ఇండియా సినిమాగా ఆగస్టు 25న విడుదల అవుతున్న ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రమోషన్స్​ నిర్వహిస్తున్నారు. ఇటీవల వరంగల్​లో ఫ్యాన్​ డమ్​ టూర్​ను జోరుగా నిర్వహించారు.

ఫ్యాన్స్​ కోలహాలంతో కిక్కిరిసిన గ్రౌండ్​..

ఫ్యాన్స్​ కోలహాలంతో కిక్కిరిసిన గ్రౌండ్​..

ఈ ప్రమోషన్స్​లో భాగంగా తాజాగా ఆంధ్రప్రదేశ్​లోని గుంటూర్​లో లైగర్​ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వేలాది అభిమానులు తరలివచ్చారు. ఓ ప్రైవెట్​ కాలేజ్​లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విజయ్​, పూరి అభిమానుల కోలహాలంతో కళాశాల గ్రౌండ్​ కిక్కిరిసిపోయింది.

లైగర్​కు సాలిడ్​ బజ్​..

లైగర్​కు సాలిడ్​ బజ్​..

ఈ ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో విజయ్​ దేవరకొండ, అనన్య పాండే, ఛార్మి, విష్​, పూరి జగన్నాథ్ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఒక్కొక్కరుగా మాట్లాడుతూ హీట్​ పుట్టించారు. వారి మాటలతో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇప్పటికే పాన్​ ఇండియా లెవెల్లో సాలిడ్​ బజ్​ను క్రియేట్​ చేసుకున్న లైగర్​కు ఈ ఈవెంట్​తో మరింత హైప్​ వచ్చింది.

 తెలుగు రాష్ట్రాల్లో హైక్స్​..

తెలుగు రాష్ట్రాల్లో హైక్స్​..

రోజురోజుకీ మరింత హైప్​ క్రియేట్​ చేసుకుంటున్న లైగర్​ టికెట్​ ధరలు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా టికెట్​ రేట్లు ఎలా ఉండనున్నాయని తెలుస్తోంది. లైగర్​కు రెండు రాష్ట్రాల్లో హైక్స్​ దక్కినట్లు సమాచారం.

తెలంగాణలో టికెట్​ ధరలు..

తెలంగాణలో టికెట్​ ధరలు..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మల్టి ప్లెక్సుల్లో లైగర్​ మూవీ గరిష్ట ధర రూ. 250 కాగా సింగిల్ స్క్రీన్​ థియేటర్​లలో రూ. 175గా ఫిక్స్​ చేసినట్లు టాలీవుడ్​ ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

ఏపీలో టికెట్​ రేట్లు ఎంతంటే?

ఏపీలో టికెట్​ రేట్లు ఎంతంటే?

ఇక ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో అయితే మల్టీ ప్లెక్సుల్లో ఉన్న గరిష్ట ధర రూ. 177 కాగా, సింగిల్​ స్క్రీన్​ థియేటర్​లలో రూ. 147గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సో ఈ ధరలతో తెలుగు రాష్ట్రాల్లో లైగర్ తన సత్తా చాటుతుందా? లేదా? అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X