Indian Idol షణ్ముఖ ప్రియకు లైగర్ ఆఫర్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

ఇండియన్ బిగ్గెస్ట్ సింగింగ్ రియాలిటీ షో ''ఇండియన్ ఐడల్ 2021'' గ్రాండ్ ఫినాలేలో తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఎంతోమంది టాలెంట్ సింగర్స్ నడుమ పోటీకి వచ్చిన ఆమె మొత్తానికి ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. టైటిల్ విన్నర్ గా నిలవలేదు గాని మొత్తానికి విజయ్ దేవరకొండ దృష్టిని మాత్రం ఆకర్షించింది.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఆమెకు ఫైనల్స్ రోజే బెస్ట్ విషెస్ ఇవ్వడమే కాకుండా గెలిచినా గెలవకపోయినా కూడా మంచి ఆఫర్ కూడా ఇస్తామని ప్రామిస్ చేశాడు. ఇక అనుకున్నట్లుగానే విజయ్ ఆమెకు మంచి అవకాశం ఇచ్చాడు. అలాగే ఒక ప్రత్యేకమైన వీడియోను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

ఫైనల్స్ వరకు వెళ్లి..

ఫైనల్స్ వరకు వెళ్లి..

ఇంతవరకు ఇండియన్ ఐడల్ హిస్టరీలో గ్రాండ్ ఫైనల్స్ వరకు తెలుగు ఫీమేల్ సింగర్స్ లలో ఎవరు చేరుకోలేదు. ఇక ఆ రేర్ ఫీట్ ను అతి చిన్న వయసులోనే షణ్ముఖ ప్రియ సాధించింది. అగ్ర గాయకులతో పోటీగా నిలవడం ప్రశంసించాల్సిన విషయం అని చెప్పవచ్చు. షణ్ముఖ ప్రియ గెలిచి తీరాలని చాలామంది అభిమానులు కోరుకున్నారు. కానీ తుది సమరంలో ఆమె టైటిల్ ను సాధించలేకపోయింది.

గెలిచినా గెలవకపోయినా..

గెలిచినా గెలవకపోయినా..

ఇక షణ్ముఖ ప్రియ గ్రాండ్ ఫైనల్స్ కు చేరుకున్న సమయంలో విజయ్ దేవరకొండ షణ్ముఖ ప్రియ కోసం ఒక ప్రత్యేకమైన వీడియోను కూడా పంపించాడు. నువ్వు గెలిచినా గెలవకపోయినా కూడా హైదరాబాద్ కు రాగానే నేను నిన్ను కలుస్తాను అని చెప్పాడు. అంతే కాకుండా నా సినిమాలో పాట కూడా పాడతావు అంటూ ముందుగానే హామీ ఇచ్చేశాడు.

తెలుగు సంప్రదాయ పద్దతిలో

తెలుగు సంప్రదాయ పద్దతిలో

ఇక వాగ్దానం ఇచ్చినట్లుగానే విజయ్ దేవరకొండ షణ్ముఖ ప్రియకు మంచి అవకాశం ఇచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో ఆమెకు పాడే అవకాశం కల్పించారు. ముందుగా ఇంటికి రాగానే విజయ్ దేవరకొండ తల్లి షణ్ముఖ ప్రియను అలాగే తన తల్లిని రిసీవ్ చేసుకున్నారు. అంతే కాకుండా తెలుగు సంప్రదాయ పద్దతిలో వారిని మర్యాదపూర్వకంగా గౌరవించారు.

లైగర్ సినిమాలో సింగింగ్..

ఇక షణ్ముఖ ప్రియతో మాట్లాడిన విజయ్ దేవరకొండ ఆమెను ఆప్యాయంగా హద్దుకున్నాడు. షణ్ముఖ కూడా ఫ్యాన్ మూమెంట్ ను బాగా ఎంజాయ్ చేసింది. మొదట ఏ పాట పాడించాలా అని నేను పూరి జగన్నాథ్ గారు నీ గత వీడియోలు చాలా చూశాము అని విజయ్, షణ్ముఖకు వివరణ ఇచ్చారు. ఇక సాంగ్ కూడా చాలా బాగా వచ్చిందని ఫైనల్ మిక్సింగ్ అయిపోగానే మరోసారి వింటాను అని కూడా దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. మరి సినిమాలో ఆ సాంగ్ ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.

Recommended Video

Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
లైగర్ రిలీజ్ ఎప్పుడంటే?

లైగర్ రిలీజ్ ఎప్పుడంటే?

ఇక లైగర్ సినిమా విషయానికి వస్తే మొదటిసారి పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. కరణ్ జోహార్ ఈ సినిమాని పూరి జగన్నాథ్ తో కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చార్మి కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయ్యింది. ఇక మిగతా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా అనుకూలించకపోవడంతో వచ్చే ఏడాది సమ్మర్ లోనే లేదా ఆ తరువాత రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X