liger రిజల్ట్ పై హ్యాపీ.. టీమ్ తో కలిసి పెద్దమ్మ తల్లి గుడిలో విజయ్ దేవరకొండ!

విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో తెర పైకి వచ్చిన లైగర్ సినిమా గురువారం రోజు గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా భిన్నమైన టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఈ సినిమా ఈ అత్యధిక ఒపెనింగ్స్ సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు కూడా ఇదే తరహాలో కొనసాగితే సినిమా పెట్టిన పెట్టుబడికి చాలా తొందరగానే లాభాలు తీసుకొస్తుంది.

ఇక ఈ తరుణంలో బాక్సాఫీస్ కలెక్షన్స్ బట్టి చిత్ర యూనిట్ చాలా సంతృప్తిగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక సినిమా విడుదలైన అనంతరం చిత్రం యూనిట్ ప్రత్యేకంగా కొన్ని టెంపుల్స్ కు కూడా వెళ్తున్నారు. ఇక రీసెంట్ గా హైదరాబాద్ లోని పెద్దమ్మ తల్లి టెంపుల్ కి కూడా విజయ్ దేవరకొండ లైగర్ టీం తో కలిసి వెళ్ళాడు. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. విజయ్ దేవరకొండ తో పాటు సహ నిర్మాత చార్మి కూడా పెద్దమ్మతల్లిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు.

vijay devarakonda liger team at hyderabad peddamma thalli temple

ఇక వీరి రాకతో అక్కడ ఒకసారి గా జనసాంద్రత పెరిగిపోయింది. విజయ్ దేవరకొండను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అయితే జనాలను కంట్రోల్ చేసేందుకు కొద్దిసేపటి వరకు భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది మొత్తానికి టైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బాగానే హార్డ్ వర్క్ చేశాడు. సినిమాలో సరికొత్త లుక్ తో కనిపించి ఓ వర్గం వారిని బాగానే పట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో విజయ్ గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా కొత్తగా కనిపించాడు అని కూడా ప్రశంసలు అందుతున్నాయి. ఇక పూరి జగన్నాథ్ తోనే విజయ్ దేవరకొండ మరొక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే జనగణమన అనే ఆ ప్రాజెక్టు పై ఇదివరకే క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్ సభ్యులు నెక్స్ట్ ఆ సినిమాను పూర్తి చేసే విధంగా అడుగులు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X