జనాలు నిన్నెందుకు అలా చూస్తున్నారు.. విజయ్ గాడితో ఏం చేస్తాం, చెప్పుకోలేక.. విజయ్ దేవరకొండ!

Recommended Video

Geetha Govindam Movie Team Press Meet

యంగ్ హీరో విజయ్ దేవరకొండ రోజు రోజుకు తన ఇమేజ్ పెంచుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం ఆగష్టు 15 న విడుదలకు సిద్ధం అయింది. రష్మిక, విజయ్ జంట యువతని ఈ చిత్రం వైపు ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎప్పటిలాగే ఈ చిత్రంలో కూడా విజయ్ దేవర కొండా అల్లరి కుర్రాడిగా నటించాడు. రేపే చిత్రం విడుదలవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ లో బిజీగా పాల్గొంటున్నారు. ఓ ఇంటర్వ్యూ లో భాగంగా విజయ్ దేవరకొండ తనపై తానే ఛలోక్తులు విసురుకుంటూ నవ్వులు పూయించారు.

నిన్నెందుకు అలా చూస్తున్నారు

నిన్నెందుకు అలా చూస్తున్నారు

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. రష్మిక నటించిన కిరిక్ పార్టీ, ఛలో చిత్రాల్లో వీడియో సాంగ్స్ కి మిలియన్ల కొద్దీ యూట్యూబ్ లో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు గీత గోవిందం చిత్రంలో 47 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అసలెందుకు జనాలు అంతగా నిన్ను చూస్తున్నారు అంటూ విజయ్ దేవరకొండ సరదాగా వ్యాఖ్యానించాడు.

స్టార్ హీరోయిన్స్

స్టార్ హీరోయిన్స్


గీత గోవిందం చిత్రానికి నన్ను ఒకే చేశారు. రోజులు గడుస్తున్నా హీరోయిన్ ఎవరో చెప్పలేదు. ఈ చిత్రంలో నటించడానికి స్టార్స్ హీరోయిన్స్ ని అడిగారట. వాళ్లంతా విజయ్ గాడితో ఎం చేస్తాంలే అని సమాధానం ఇచ్చారు.

 అల్లు అరవింద్ గారు

అల్లు అరవింద్ గారు


ఆ విషయాన్ని అల్లు అరవింద్ గారు నాతో చెప్పలేక ఇబ్బంది పడ్డారని విజయ్ దేవరకొండ సరదా కామెంట్స్ చేశాడు. సినిమా అంతా ఎక్కువగా హీరోయిన్ మీదే నడుస్తుందని విజయ్ తెలిపాడు. అలాంటి పాత్ర కోసం రష్మిక అంగీకరించడం సినిమాకు చాలా ప్లస్ అయిందని తెలిపాడు.

మరో స్థాయికి

మరో స్థాయికి

గోపి సుందర్ అందించిన సంగీతం, అనంత్ శ్రీరామ్ లిరిక్స్ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకుని వెళ్లాయని విజయ్ దేవరకొండ తెలిపాడు. ఈ ఆల్బంలో ఇంకేం ఇంకేం కావాలె అనే పాట తనకు ఇష్టమైన సాంగ్ అని విజయ్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X