విజయ్ దేవరకొండ ఛాన్స్ ఇస్తున్నాడు..: ఇప్పుడైనా రైజ్ అవుతాడా?

అర్జున్ రెడ్డి సినిమాతో తానేంటో నిరూపించుకున్న విజయ్ దేవరకొండ.. తదుపరి సినిమాల కథల విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. రొటీన్, మూస కథల కన్నా విభిన్న తరహా చిత్రాల్లో నటించడానికే విజయ్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రస్థానం ఫేమ్ దేవకట్టాతోనూ ఓ సినిమా కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడట విజయ్.. ఆ విశేషాలు మీకోసం..

Recommended Video

టాలీవుడ్ టాక్ ఆఫ్ ది ఇయర్ అర్జున్ రెడ్డి నే !

డిఫరెంట్ సబ్జెక్ట్:

డిఫరెంట్ సబ్జెక్ట్:

సాధారణంగా దేవకట్టా ఎంచుకునే సబ్జెక్ట్స్ మిగతా దర్శకుల కన్నా విభిన్నంగానే ఉంటాయి. తాజాగా విజయ్ కి కూడా ఆయనో డిఫరెంట్ సబ్జెక్ట వినిపించారట. కథ, కథనం కొత్తగా ఉండటంతో విజయ్ కూడా దేవకట్టాతో సినిమా చేసేందుకే మొగ్గు చూపుతున్నాడని టాక్.

ఫ్లాప్‌లో ఉన్నా..:

ఫ్లాప్‌లో ఉన్నా..:

నిజానికి దేవకట్టా ప్రస్తుతం ఫామ్ లో లేడు. ఆయన చివరి చిత్రం 'ఆటో నగర్ సూర్య..' భారీ అంచనాల నడుమ విడుదలై ఫ్లాప్ గా మిగిలిపోయింది. అయినా సరే, తెరపై కథను ప్రెజెంట్ చేయడంలో దేవకట్టాలో ఉన్న స్పెషాలిటీని విస్మరించలేం. విజయ్ కి కూడా అదే నచ్చిందట. అందుకే ఇక ఈ ప్రాజెక్టుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం అన్న ప్రచారం జరుగుతోంది.

విజయ్ ప్రకటిస్తాడట..:

విజయ్ ప్రకటిస్తాడట..:

దేవకట్టాతో సినిమాకు సంబంధించి త్వరలోనే విజయ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటిస్తాడట. ప్రస్తుతం గీత ఆర్ట్స్ లో పరుశురామ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు విజయ్. అది గాక.. ట్యాక్సీవాలా అనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ లోనూ, మహానటి సినిమాలోను నటిస్తున్నాడు. అదే సమయంలో తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ తోనూ ఓ సినిమా కమిట్ అయ్యాడు.

ఫామ్‌లో లేని దేవకట్టా:

ఫామ్‌లో లేని దేవకట్టా:

ప్రస్థానం సినిమాతో తెలుగు తెర మీద అద్భుతమైన కథను ఆవిష్కరించిన దేవకట్టా.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో సినిమాలు తీయలేకపోయాడు. 'వెన్నెల' లాంటి మ్యాజిక్ కూడా ఆయన నుంచి మళ్లీ రిపీట్ కాలేదు. ఆటోనగర్ సూర్య, డైనమైట్ లాంటి ఫ్లాపులతో కెరీర్ పరంగా దేవకట్టా ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.

విజయ్‌తో రైజ్ అవుతాడా?:

విజయ్‌తో రైజ్ అవుతాడా?:


నిజానికి మంచు విష్ణుతో చేసిన డైనమైట్ సినిమాను దేవకట్టా ఏదో మొహమాటానికి పోయి ఒప్పేసుకున్నాడన్న ప్రచారం ఉంది. ఆ సినిమా ఆయన కెరీర్ ను మరింత డ్యామేజ్ చేసింది. ఈ డ్యామేజ్ ను పూడ్చేలా మరోసారి అద్భుతమైన కథతో వస్తున్నట్లు తెలుస్తోంది. దానికి విజయే పర్ఫెక్ట్ అని దేవకట్టా భావిస్తున్నాడట. చూడాలి మరి.. విజయ్ సినిమాతోనైనా దేవకట్టా రైజ్ అవుతాడేమో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X