TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
విజయ్ దేవరకొండ.. మళ్లీ కేక పుట్టించాడు: వాళ్లకు ఊహించని సర్‌ప్రైజ్..
అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ను షేక్ చేసిన ఆ సినిమాతో విజయ్ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు.

సినిమాలతోనే కాదు, వ్యక్తిగతంగాను అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు విజయ్. అర్జున్ రెడ్డి సమయంలో రోడ్డుపై తన బొమ్మ అభిమానాన్ని చాటుకున్న ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్‌ను తాజాగా విజయ్ కలుసుకున్నాడు. ఆ విశేషాలు మీకోసం..
విజయ్ సర్‌ప్రైజ్:
అర్జున్ రెడ్డి హిట్ తర్వాత కొంతమంది ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్.. రోడ్డుపై రంగులతో విజయ్ దేవరకొండ చిత్రాన్ని గీశారు. తన పట్ల అభిమానాన్ని చాటుకున్న విద్యార్థులను సర్ ప్రైజ్ చేయడానికి వెళ్లాడు విజయ్. ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా క్యాంపస్ లోకి ఎంట్రీ ఇచ్చి వారిని ఆశ్చర్యానికి గురిచేశాడు.
|
'హ్యాపీ చేసి వెళ్లిపోవాలి':
ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విషయాన్ని విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేశారు. 'నూతన సంవత్సరానికి నేను ఇక్కడ ఉండను. అందుకే అందర్నీ ఇప్పుడే కలిసి, హ్యాపీ చేసి వెళ్లిపోవాలి' అని ఆ వీడియోలో విజయ్ పేర్కొనడం విశేషం.
క్రేజీ లుక్స్:
వీడియోలో విజయ్ క్రేజీ లుక్స్‌లో కనిపించాడు. తలకు క్యాప్ పెట్టుకుని స్టూడెంట్స్ తో కలిసి సందడి చేశాడు. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో వారికి గిఫ్ట్స్ ఇచ్చి మరింత సర్ ప్రైజ్ చేశాడు. విజయ్ ని చూడగానే యువకులంతా కేకలు, అరుపులతో హంగామా చేశారు. స్టూడెంట్స్ తో గడపడం అద్భుతంగా అనిపించిందని తెలిపాడు.
విజయ్ తమిళ్ డెబ్యూ:
విజయ్ దేవరకొండ ప్రస్తుతం సావిత్రి బయోపిక్ 'మహానటి'తో పాటు, 'ఏ మంత్రం వేసావె', 'ట్యాక్సీవాలా', సినిమాల్లో నటిస్తున్నారు. తమిళంలో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు విజయ్. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.