twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vijay Devarakonda: మొన్న అనకొండ.. నేడు బంగారు కొండ.. విజయ్​ దేవరకొండకు సారీ చెప్పిన మనోజ్ దేశాయ్​

    |

    రౌడీ స్టార్ విజయ్​ దేవరకొండ, టాలీవుడ్​ మాస్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​ కలయికలో వచ్చిన చిత్రం లైగర్​. ఎన్నో అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచి ఫ్లాప్​ టాక్​ను మూటగట్టుకుంటున్న లైగర్​ చిత్రంపై, హీరో విజయ్​ దేవరకొండపై సర్వత్రా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్​ దేవరకొండను ఉద్దేశిస్తూ మరాఠా మందిర్ సినిమా థియేటర్ల ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్ మనోజ్​ దేశాయ్ ఇటీవల తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ విషయం తెలిసి మనోజ్​ దేశాయ్​ను విజయ్​ స్వయంగా కలిసి షాక్​ ఇచ్చాడు.

     మార్షల్​ ఆర్ట్స్ నేపథ్యంలో..

    మార్షల్​ ఆర్ట్స్ నేపథ్యంలో..

    టాలీవుడ్​లో మాస్​ డైరెక్టర్​గా పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. అలాగే రౌడీ హీరోగా క్రేజ్​ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. వీరిద్దరి కాంబినేషన్​లో ఫస్ట్​ టైమ్ వచ్చిన మూవీ లైగర్. మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​ నేపథ్యంలో లైగర్​ తెరకెక్కిన విషయం తెలిసిందే.

    విజయ్​ నటనపై ప్రశంసలు..

    విజయ్​ నటనపై ప్రశంసలు..

    ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 25న వరల్డ్​వైడ్​గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్​ ఇండియా సినిమాగా విడుదలైంది. అయితే అంచనాలకు భిన్నంగా లైగర్​ మిక్స్​డ్​ టాక్​ను తెచ్చుకుంటోంది. సినిమా సంగతి ఎలా ఉన్నా విజయ్​ దేవరకొండ నటనను మాత్రం కొనియాడుతున్నారు.

    మనోజ్​ దేశాయ్​ని కలిసిన విజయ్​..

    ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్స్​లో విజయ్​ దేవరకొండ వైఖరినీ తప్పుబడుతూ మరాఠా మందిర్​ సినిమా థియేటర్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​ మనోజ్ దేశాయ్​ తీవ్రంగా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసుకున్న విజయ్ దేవరకొండ నేరుగా మనోజ్​ దేశాయ్​ను కలుసుకున్నాడు.

    విజయ్​ మర్యాద ఉన్నవాడు..

    విజయ్​ మర్యాద ఉన్నవాడు..

    హైదరాబాద్​ నుంచి ప్రత్యేకంగా మనోజ్​ దేశాయ్​ను కలిసేందుకు ముంబై వెళ్లాడు విజయ్​ దేవరకొండ. తనతో విజయ్​ సమావేశం కావడం పట్ల మనోజ్​ దేశాయ్ సంతోషం వ్యక్తం చేశాడు. ''నా కామెంట్స్​ మీద ఉన్న అపార్థాన్ని తొలగించేందుకు విజయ్ ముంబైకి వచ్చాడు. ఒక స్టార్​గా అతను మంచి మర్యాదను చూపించాడు. ఇక ముందు మంచి సినిమాలు చేస్తానని హామీ ఇచ్చాడు'' అని మనోజ్​ దేశాయ్​ పేర్కొన్నాడు.

     విజయ్​ ప్రవర్తనతోనే..

    విజయ్​ ప్రవర్తనతోనే..

    కాగా విజయ్​ను.. దేవరకొండ కాదు అనకొండ, అనకొండలా మాట్లాడుతున్నాడని మనోజ్ దేశాయ్​ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విజయ్​ ప్రవర్తన థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్​ పై తీవ్ర ప్రభావం చూపించిందని మనోజ్​ పేర్కొన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని, ఇప్పుడు అదే జరుగుతుందని అన్నారు.

    వాటికి నష్టాలు..

    అలాగే తమకు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని, అయితే ఇంటర్వ్యూలలో విజయ్​ చేసిన వ్యాఖ్యలు బుకింగ్స్​ మీద ప్రభావం చూపించాయని మనోజ్ దేశాయ్​ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల బాయ్​కాట్ బాలీవుడ్ ట్రెండ్​తో లాల్ సింగ్ చద్ధా, రక్షా బంధన్, దొబారా చిత్రాలు నష్టాలు చవిచూసిన విషయం తెలిసిందే.

    English summary
    Vijay Devarakonda Met Maratha Mandir Theatre Executive Director Manoj Desai
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X