విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫండ్.. టార్గెట్ డబుల్ అయ్యింది!
టాలీవుడ్ రౌడి స్టార్ విజయ్ దేవరకొండ ఏం చేసినా డిఫరెంట్ గానే ఉంటుంది. సినిమాలతోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఈ స్టార్ యాక్టర్ నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా కష్టకాలంలో విజయ్ తన స్పెషల్ టీమ్ తో చేస్తున్న మంచి పనులు అందరిని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని వారికి అండగా నిలబడేందుకు మంచి ప్లాన్ వేశాడు.
తన వెబ్ సైట్ ద్వారా మిడిల్ క్లాస్ ఫ్యామిలిస్ వివరాలను తీసుకొని ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయల వరకు ఆహార సామగ్రిని కొనిస్తున్నాడు. విషయం తెలుసుకున్న చాలా మంది విజయ్ మిడిల్ క్లాస్ ఫండ్ ప్లాన్ కి మద్దతు పలుకుతూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయంపై స్పంధించిన రౌడీ బాయ్ ఒక మ్యాజిక్ చూసినట్లు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు.

మాస్ కేర్, మాస్ లవ్.. అంటూ మిడిల్ క్లాస్ ఫండ్ సక్సెస్ కావడానికి మిరే కారణమని చెబుతూ.. ఈ పనిలో నేను ఎంత మాత్రం వెనుకడుగు వేసేది లేదని, ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు వచ్చే వరకు పోరాడుతూనే ఉంటానని అన్నారు. అలాగే 25లక్షలతో మొదలైన ఈ ప్రయాణం 40 లక్షలకు చేరిందని దీంతో 2000లకు పైగా కుటుంబాలను రిసెట్ చేయాలని అనుకున్న మనం 4000+ కి చేరిందని పేర్కొన్నారు. ఇక ప్రతిరోజు రాత్రి 9గంటలకు మా ప్రతి వర్క్ యొక్క అప్డేట్ ఇస్తామని, అందరం కలిసి పనిచేసేలా ముందుకు సాగుతున్నట్లు విజయ్ దేవరకొండ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు.


Click it and Unblock the Notifications











