అద్దె‌ఇంట్లో కష్టాలు, సిగ్గేసేది, కసి పెరిగింది... నాలాగే రౌడీ అవ్వండి: విజయ్ దేవరకొండ

By Bojja Kumar

టాలీవుడ్ స్టార్ విజయ్‌ దేవరకొండ 'రౌడీ' పేరుతో తన సొంత దుస్తుల బ్రాండ్‌ లాంచింగ్ సందర్భంగా నిర్వహించిన 'రౌడీ సన్‌డౌనర్‌ పార్టీ'లో ఆసక్తికరంగా ప్రసంగించారు. నేను మీ(అభిమానులు) అందరినీ రౌడీ అని ఎందుకు పిలుస్తాను? రౌడీ అనే పేరు ఎంచుకోవడం వెనక కారణం ఏమిటి? అనే విషయాన్ని విజయ్ దేవరకొండ వివరించారు. జీవితంలో కసిగా ముందుకు దూసుకెళ్లాలంటే మనం చేసే పనిలో రౌడీతనం ఉండాలి అని విజయ్ వ్యాఖ్యానించారు.

Recommended Video

Vijay Deverakonda filmfare Award Get Auctioned
నాలో రౌడీ ఉండటం వల్లే సాధ్యమైంది

నాలో రౌడీ ఉండటం వల్లే సాధ్యమైంది

మొదట నన్ను స్కూల్లో మా టీచర్లు రౌడీ అని పిలిచేవారు, ఇంట్లో మా నాన్న అప్పుడప్పుడూ రౌడీ వెదవ, రౌడీ ఫెలో అని తిడుతుండేవాడు. థియేటర్ యాక్టింగ్ ఇవన్నీ చేస్తున్నపుడు రకరకాల మంది నన్ను రౌడీ అని తిట్టేవారు. అపుడు వారు నన్ను అలా అనడం నాకు నచ్చలేదు. నన్ను ఎందుకు తిడుతున్నారు అనుకునేవాడిని. ఈ రోజు ఇక్కడి వరకు వచ్చానంటే, నాకు నచ్చిన పని నాకు నచ్చినట్లు చేయగలుగుతున్నానంటే నాలో రౌడీ ఉండటం వల్లే. నేను మిమ్మల్ని అలా పిలవడానికి కారణం... నేను కూడా మీ లాంటి రౌడీనే. మీలో నన్ను నేను చూసుకుంటాను... అని విజయ్ వ్యాఖ్యానించారు.

 అద్దె ఇంట్లో ఉంటున్నామని చెప్పుకోవడానికి సిగ్గేసేది

అద్దె ఇంట్లో ఉంటున్నామని చెప్పుకోవడానికి సిగ్గేసేది

చిన్నతనం నుండి మేము అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. మా ఫ్రెండ్స్ వద్ద మాది రెంటెడ్ హౌస్ అని చెప్పుకోవడానికి సిగ్గేసేది. ఆరు నెలల క్రితమే సొంత ఇంట్లోకి మూవ్ అయ్యాను. కానీ మన ఫ్రెండ్స్ మనం రెంటెడ్ హౌస్‌లో ఉంటున్నామా? డబ్బులున్నాయా? లేవా? అని చూడకుండా ఉండేవారే అసలైన ఫ్రెండ్స్. అలాంటి ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారు... అని విజయ్ చెప్పుకొచ్చారు.

అలాంటి వారికే కసి ఉంటుంది

అలాంటి వారికే కసి ఉంటుంది

రెంటెడ్ హౌస్‌లో ఉండే వారికే సొంతిల్లు కావాలనే ఒక డ్రీమ్ ఉంటుంది. ఒక కసి ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. అది మిమ్మల్ని మరింత ఎక్కువ కసిగా ముందుకు నడిపిస్తుంది. నాకు కూడా అదొక మోటివేషన్‌గా ఉండటం వల్లనే ఇది సాధ్యమైంది. అదే నన్ను ఈ స్థాయికి వచ్చి సొంతిల్లు కొనేలా చేసింది అని విజయ్ తెలిపారు.

 చాలా మంది డబ్బులు పెట్టమని అడిగేవారు

చాలా మంది డబ్బులు పెట్టమని అడిగేవారు

సొంతిల్లు కావాలంటే సక్సెస్ ఫుల్ కెరీర్ కావాలి. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఇటువైపు వచ్చాను. కొత్త యాక్టర్ కోసం ఏ ప్రకటన వచ్చినా ప్రతి ఆడిషన్‌కు వెళ్లేవాడిని. చాలా సినిమాల ఆడిషన్స్‌లో టాప్ 3, టాప్ 4 వరకు వెళ్లాను. రేపు కాల్ చేసి ఫైనల్ ఎవరో చెబుతామనేవారు. మర్నాడు కాల్ చేసి మీరు టాప్ 3లో సెలక్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లే. సినిమాలో డబ్బులు పెట్టగలుగుతారా అని కొంతమంది అడుగేవారు. నేను యాక్టింగ్ చేసేదే డబ్బులు సంపాదించడానికి, మీరు అలా అడుగుతారేంటి? అనగానే కాల్ డిస్ కనెక్ట్ చేసేవారు. వేరే ఎవరో హీరో అయ్యేవారు.... అని విజయ్ దేవరకొండ గుర్తు చేసుకున్నారు.

ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు

ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు

చాలా మంది ఆడిషన్ పూర్తయ్యాక మీ డాడీ ఏం చేస్తారు? అని అడిగేవారు. హీరో కావాలంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. ఒక గాడ్ ఫాదర్ ఉండాలని చెప్పేవారు. ఒక మంచి అవకాశం కోసం చాలా రోజులుగా ఎదురు చూశాను. ఆ అవకాశం ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో వచ్చింది. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు.

 ఎవరూ పిలవరు, మనమే బద్దలు కొట్టుకుని వెళ్లిపోవాలి

ఎవరూ పిలవరు, మనమే బద్దలు కొట్టుకుని వెళ్లిపోవాలి

నేను మీకు చెప్పేది ఒకటే, మనకు ఎవరూ పిలిచి అవకాశాలు ఇవ్వరు. తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్లిపోవాలి. కొన్ని సార్లు బద్దలు కొట్టడానికి తలుపు కూడా ఉండవు. ఏదైనా సందు చూసుకోవాలి. సందు దొరికిందంటే దూసుకెళ్లిపోవాలి. మన బెటర్మెంట్ కోసం మనం చేసేదే రౌడీ... అందుకే మీ అందరినీ రౌడీస్ అని పిలుస్తుంటాను... అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X