విజయ్ దేవరకొండ సినిమా వాయిదా!
పెళ్లి చూపులు చిత్రంతో నటుడిగా అర్జున్ రెడ్డి చిత్రంతో కమర్షియల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా టాక్సీవాలా. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను జిఏ 2 మరియు యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ కె ఎన్ నిర్మాత.
నూతన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ టాక్సీవాలా సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా టాక్సీవాలా చిత్రం ఉంటుందని చెబుతున్నారు చిత్ర బృందం.

ఇటీవల విడుదలైన టాక్సీవాలా చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యాలి అనుకున్నారు. కాని కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా విడుదల వాయిదా పడినట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. జూన్ లో సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











