షూటింగులో తప్పిన భారీ ప్రమాదం, గాయాలతో బయటపడ్డ విజయ్ దేవరకొండ (వీడియో)
Recommended Video

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఆయన నటిస్తున్న 'డియర్ కామ్రెడ్' చిత్రం షూటింగ్ కాకినాడలో జరుగుతోంది. రైల్వే ష్టేషన్లో చిత్రీకరణ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే.... పరుగెత్తుకుంటూ వచ్చిన విజయ్ ట్రైన్ ఎక్కుతూ జారి పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ ఎడమచేతికి గాయాలయ్యాయి. అయితే పెద్ద ప్రమాదం తప్పడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ పడిపోగానే అక్కడున్నవారంతా ఉలిక్కిపడిన విషయాన్ని వీడియోలో గమనించవచ్చు.

షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేత
విజయ్ చేతికి గాయాలు కావడంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని గంటల తర్వాత కాస్త తేరుకున్న విజయ్.... మళ్లీ షూట్ కంటిన్యూ చేసినట్లు తెలుస్తోంది.

గాయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి, ఏది ఊరికే రాదు
జీవితంలో ఏది ఊరికే రాదు. అప్పుడప్పుడు ఇలాంటి గాయాలు అవుతుంటాయి. వాటిని కూడా సెబ్రేట్ చేసుకోవాలి... అంటూ విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించడం గమనార్హం.

డియర్ కామ్రేడ్
నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్' చిత్రం రూపొందుతోంది. తెలుగులో ఇప్పటి వరకు రాని ఒక సరికొత్త కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'ఫైట్ ఫర్ వాట్ యు లవ్' అనేది సబ్ టైటిల్.

భారీ అంచనాలు
‘గీత గోవిందం', ‘టాక్సీవాలా' చిత్రాల తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











