విజయ్ దేవరకొండ బీస్ట్ మోడ్.. హై వోల్టేజ్ లుక్ మామూలుగా లేదు!

టాలీవుడ్ రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న విజయ్ దేవరకొండ ఎలాంటి లుక్ లో కనిపించినా కూడా డిఫరెంట్ ఉంటాడని చెప్పవచ్చు. వీలైనంత వరకు ప్రయోగాత్మకమైన పాత్రలను చేసే దేవరకొండ పెద్దబ్బాయి తనలోని అసలైన యాక్షన్ ఎలివేషన్ ను ఇంతవరకు చూపించలేదు. లైగర్ సినిమాలో ఆ యాక్షన్ మోడ్ ను హై రేంజ్ లో చూపించే అవకాశం ఉందట. ఇక ఇటీవల తనలోని హై వోల్టేజ్ లుక్ ను చూపించడంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిన్న సినిమాలతోనే..

చిన్న సినిమాలతోనే..

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చాలా కష్టపడి పైకొచ్చిన నేటితరం హీరోలలో విజయ్ దేవరకొండ టాప్ లిస్టులో ఉంటాడని చెప్పవచ్చు. మొదట్లో నెగిటివ్ రోల్స్ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన విజయ్ ఆ తరువాత చిన్న సినిమాతో బిగ్ హిట్స్ అందుకున్నాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలు ఏ రేంజ్ లో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఫిట్నెస్ లో కూడా

ఫిట్నెస్ లో కూడా

ఇక విజయ్ దేవరకొండ సినిమా సినిమాకు తన రేంజ్ ను మార్చుకుంటున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చాలా ఎనర్జిటిక్ గా ముందుకు వెళుతున్నాడు. ఫిట్నెస్ లో కూడా విజయ్ మెల్లగా మార్పులు చేస్తున్నాడు. వీలైనంత వరకు కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తున్నాడు.

లైగర్ లో డిఫరెంట్ లుక్

లైగర్ లో డిఫరెంట్ లుక్

ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఈసారి అంతకు మించి అనేలా సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విదంగా తన లుక్ మొత్తం మార్చేశాడు. హెయిర్ స్టైల్ తోనే లైగర్ అనే ట్యాగ్ ను గుర్తు చేస్తున్నాడు. విజయ్ ఫస్ట్ లుక్ కూడా సోషల్ మీడియాలో అప్పట్లో భారీ స్థాయిలో ట్రెండ్ అయ్యింది.

జిమ్ లో విజయ్ హార్డ్ వర్క్

ఇక ఇటీవల కరోనా కారణంగా బ్రేక్ రావడంతో విజయ్ మళ్ళీ జిమ్ లో తన వర్కౌట్స్ మొదలు పెట్టాడు. ఫిట్నెస్ ట్రైనర్ విజయ్ కు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశాడు. హాలిడేస్ కారణంగా జిమ్ ఖాళీగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తి తన వర్క్ లో బిజీగా ఉన్నారు అని బీస్ట్ ఫర్ లైఫ్ ఆన్స్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. విజయ్ దేవరకొండ ఈ లుక్ లో చాలా హై వోల్టేజ్ తో కనిపిస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

లైగర్ పై భారీ అంచనాలు

లైగర్ పై భారీ అంచనాలు

ఇక విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాను ఈ ఏడాది మే నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ క్యాన్సిల్ అవ్వడంతో పాటు మిగతా సినిమాలతో కూడా క్లాష్ ఉండకుండా ఉండాలని ఆగస్టు నెలలోకి షిఫ్ట్ చేశారు. మరి ఆ సమయంలో సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X