హమ్మయ్య అనుకుంటే మళ్ళీ కెలికాడు.. మహేష్, బన్నీ అనే భయం కూడా లేదా!

Recommended Video

Allu Arjun & Mahesh Babu Fights With Arjun Reddy

సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ తాజా చిత్రాల విడుదల విషయంలో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భరత్ అనే నేను, నా పేరు సూర్య చిత్రాలు రెండు వారాల గ్యాప్ లో విడుదలయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి. మొదటగా ఈ రెండు చిత్రాలు ఏప్రిల్ 27 న విడుదల అయ్యేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నాయి. కానీ నిర్మాతల చర్చలతో భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 కి ప్రీపోన్ కాగా, నా పేరు సూర్య చిత్రం మే 4 కు పోస్టుపోన్ అయింది. వివాదం సద్దుమణిగింది అని అనుకుంటే క్రేజీ యువహీరో విజయ్ దేవరకొండ ఈ బిగ్ స్టార్స్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. మహేష్, బన్నీల చిత్రాలకు కూసంత దూరంలో తన సినిమాని విడుదల చేసేందుకు సిద్ధం అవుతన్నాడు.

 భారీ అంచనాలతో భారత అనే నేను

భారీ అంచనాలతో భారత అనే నేను

భరత్ అనే నేను చిత్రం మహేష్ కెరీర్ లోనే భారీ అంచనాలతో విడుదలకు సిద్ధం అవుతోంది.మహేష్ బాబు ఈ చిత్రంలో రాజకీయనాయకుడిగా, ముఖ్యమంత్రిగా కనిపించబోతుండడంతో అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొని ఉంది.

 బన్నీ జోరుకు అడ్డుందా

బన్నీ జోరుకు అడ్డుందా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బన్నీ చిత్రాలన్నీ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మిలటరీ మాన్ గా బన్నీ నా పేరు సూర్య చిత్రంలో నటిస్తున్నాడు. ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో విడుదలైన టీజర్ అదిరిపోయిన సంగతి తెలిసిందే.

 ఇద్దరి టార్గెట్ అదే

ఇద్దరి టార్గెట్ అదే

మహేష్, బన్నీ ఇద్దరూ వేసవి సెలవులని టార్గెట్ చేసారు. వేసవి సెలవుల్లో ఇంటిల్లిపాది సినిమా చూడడానికి వెళతారు. దీనితో ఈ రెండు చిత్రాల విడుదల విషయంలో సందిగ్దత నెలకొంది.

చర్చలతో రాజీ

చర్చలతో రాజీ

ఏప్రిల్ 27 రావాలనుకున్న ఈ రెండు చిత్రాలు నిర్మాతల చర్చలతో రాజీ కుదిరింది. రెండు సినిమాలకు కొత్త విడుదల తేదీలు కుదిరాయి. భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 న, నా పేరు సూర్య చిత్రం మే 4 న విడుదల కానున్నాయి.

 విజయ్ దేవరకొండ ఎంట్రీ

విజయ్ దేవరకొండ ఎంట్రీ

వివాదం సద్దుమణిగిందని ఊరపి పీల్చుకుంటున్న తరుణంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు. మహేష్, బన్నీ వంటి వారి చిత్రాలకు దగ్గర్లో తన సినిమాని విడుదల చేయబోతున్నాడు.

మే నెలలోనే

మే నెలలోనే

విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం మే 18 న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇటీవలే ప్రీలుక్ పేరుతో నల్లటి కారుబొమ్మని విడుదల చేసారు. త్వరలోనే ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారు.

 మహేష్, బన్నీ చిత్రాలకు డోకా లేదు

మహేష్, బన్నీ చిత్రాలకు డోకా లేదు

విజయ్ దేవరకొండ చిత్రం వలన మహేష్, బన్నీ చిత్రాలకు ఎటువంటి డోకా ఉండబోదు. మహేష్, బన్నీ టాలీవుడ్ లో బిగ్ స్టార్స్ గా కొనసాగుతున్నారు. విజయ్ దేవరకొండ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు.

 అర్జున్ రెడ్డికే ఎఫెక్ట్

అర్జున్ రెడ్డికే ఎఫెక్ట్

భరత్ అనే నేను, నా పేరు సూర్య చిత్రాలకు పాజిటివ్ టాక్ వస్తే ఆ ప్రభావం నెలరోజులు ఖాయంగా ఉంటుంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ చిత్రానికే ఎఫెక్ట్ అని అంటున్నారు సినీ పండితులు.

 సంచలనాల క్రేజీ బాయ్

సంచలనాల క్రేజీ బాయ్

పెళ్లి చూపులు చిత్రంతో తొలి హిట్ ని ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో సంచనలం సృష్టించాడు. యువత దృష్టినంతా తన వైపుకు తిప్పుకున్నాడు.

 వివరాలు

వివరాలు

అర్జున్ రెడ్డి నటిస్తున్న ఈ చిత్రం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రానికి టాక్సీ వాలా అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మాళవిక నైర్, ప్రియాంక జవాల్కర్ ఈ చిత్రంలో హీరోయిన్లు గా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X