గీత ఆర్ట్స్ బ్యానర్‌లో విజయ్ దేవరకొండ చిత్రం.. టైటిల్ భలేగుంది!
యువ హీరో విజయ్ దేవరకొండ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. విజయ్ దేవరకొండ త్వరలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్ ఖరారైంది. గీత గోవిందం అనే టైటిల్ ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ టైటిల్ లోగో విడుదుల చేసారు.
గురువారం రోజు ప్రీ లుక్ విడుదల చేయనున్నారు. ప్రతిష్టాత్మకమైన గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కనుండడంతో ఆసక్తి నెలకొని ఉంది. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు.

రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తారు. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











