మెగాస్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ.. అసలు నిజమిదే..
రౌడి స్టార్ విజయ్ దేవరకొండ కూడా మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు గత కొన్నిరోజులుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చేయనున్న మలయాళం రీమేక్ లూసిఫర్ లో ఒక బలమైన పాత్రలో నటించబోతున్నట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. మొదట ఈ పాత్రకు మెగా హీరోలని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఆ తరువాత దర్శకుడు సుజిత్ మళ్ళీ విజయ్ దేవరకొండను ఫిక్స్ చేసినట్లు రూమర్స్ రాగా విజయ్ సన్నిహిత వర్గాలు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేశారు. నిజానికి మెగాస్టార్ రోల్ కి సపోర్టింగ్ గా ఉండే బలమైన పాత్ర కోసం కుర్ర హీరోలని సెలెక్ట్ చేయాలని దర్శకుడు ఆలోచిస్తున్నాడు. కొంత మంది యువ హీరోల పేర్లను కూడా మెగాస్టార్ ముందు ఉంచారట. కానీ ఇంకా ఆ విషయంలో మెగాస్టార్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

అప్పటివరకు దర్శకుడు సుజిత్ మిగతా పాత్రల కోసం నటీనటులను సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డారు. మంజు వారియర్, రోజా వంటి వారు సినిమాలో కొన్ని కీలక పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్తల్లో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను పూర్తి చేసిన తరువాత లూసిఫర్ రీమేక్ ని స్టార్ట్ చేయాలని మెగాస్టార్ ప్లాన్ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











