ఆమె గురించి ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెబుతా.. ఫారెన్ యువతితో ఎఫైర్ గురించి విజయ్ దేవరకొండ!

Recommended Video

Vijay Devarakonda On Love Affair With Belgium Girlfriend

టాలీవుడ్ నయా స్టార్‌గా విజయ్ దేవరకొండ మారిపోయాడు. విజయ్ నటన, ఆటిట్యూడ్ యువతని విపరీతంగా ఆకర్షిస్తోంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో విజయ్ దేవరకొండ దూసుకుపోతున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం నోటా. భారీ అంచనాలతో అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నోటా ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న విజయ్ దేవరకొండ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి, నోటా చిత్రం గురించి ఆసక్తికర విశేషాలు వెల్లడించాడు.

2020 వరకు

2020 వరకు

తాను ప్రస్తుతం అంగీకరించిన చిత్రాలన్నీ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. 2020 ఆరంభం వరకు తీరిక లేదు. ఆ తరువాత బాగా గ్యాప్ తీసుకుంటానని విజయ్ దేవరకొండ తెలిపాడు. నోటా విడుదలకు సిద్ధం అవుతుండగా డియర్ కామ్రేడ్ చిత్రంలో కూడా విజయ్ నటిస్తున్నాడు.

ఫారెన్ యువతి గురించి

ఫారెన్ యువతి గురించి

విజయ్ దేవరకొండకు ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. ఫారెన్ యువతితో ఎఫైర్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఫోటోలు వైరల్ కావడంపై స్పందిస్తూ.. అందరి లైఫ్ లో ఏదో ఒక డ్రామా ఉండాలి కదా మాట్లాడుకోనివ్వండి. అందరూ వేచి చూస్తే ఈ విషయంలో క్లారిటీ వస్తుందని విజయ్ దేవరకొండ తెలిపాడు.

బెల్జియం అమ్మాయితో

బెల్జియం అమ్మాయితో

ఇటీవల విజయ్ దేవరకొండ బెల్జియంకు చెందిన యువతితో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ యువతి విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కూడా కలసి ఉండడం విశేషం.దీనితో వీరి మధ్య ప్రేమాయణం సాగుతుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఫొటోలే బయటకు వచ్చాయి

ఫొటోలే బయటకు వచ్చాయి

ప్రేమ గురించి వస్తున్న వార్తల గురించి స్పందిస్తూ.. ఫొటోలే బయటకు వచ్చాయి అంటే ఏదో ఉన్నట్లే కదా అంటూ విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సమయం వచ్చినప్పుడు ఆమె గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతా అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

 నేను రాజకీయ నాయకుడు అయితే

నేను రాజకీయ నాయకుడు అయితే

అవకాశం ఉంటే రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్నకు కూడా విజయ్ దేవరకొండ సరదాగానే సమాధానం ఇచ్చాడు. రాజకీయాలు అందరికి సంబంధించినవే అని తెలిపాడు. తాను రాజకీయాల్లోకి వస్తే నన్నెవరూ కెలకకూడదు. నేను నేనులా ఉండాలనుకుంటా. దాని వలన ఇతర పొలిటిషియన్లతో పాటు జనాలకి కూడా మెంటల్ వస్తుందని ఫన్నీ కామెంట్స్ చేశాడు.

కొన్ని సమస్యలు

కొన్ని సమస్యలు

నిజజీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటునప్పుడు మన చేతిలో అధికారం ఉంటే ఇలా చేసి ఉండేవాళ్ళం కదా అనే ఆలోచన వస్తుందని విజయ్ దేవరకొండ తెలిపాడు. కానీ ఏం జరుగుతుందో ముందుగానే చెప్పలేం కదా అని తెలిపాడు.

లీడర్, భరత్ అనే నేనుకు భిన్నంగా

లీడర్, భరత్ అనే నేనుకు భిన్నంగా

నోటా చిత్రంలో తాను పోషించిన ముఖ్యమంత్రి పాత్ర లీడర్ లో రానా, భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు పాత్రకంటే భిన్నంగా ఉంటుందని విజయ్ దేవరకొండ తెలిపాడు. నిజంగానే నాకు అలాంటి ఘటనలు ఎదురైతే ఎలా ఉంటానో అలాగే నటించానని విజయ్ దేవరకొండ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X