Don't Miss!
- Sports
IND vs SA: రెండో ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ విఫలం.. భారీ ఆధిక్యం దిశగా భారత్!
- News
ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్ని గ్రామస్తులు: ఒకరు మాజీ బీజేపీ మైనార్టీ నేత, రూ. 5 లక్షల రివార్డ్
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 03 నుండి జూలై 9వ తేదీ వరకు..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
The Liger Hunt Theme: విజయ్ దేవరకొండ హై వోల్టేజ్ టీజర్.. లిరిక్స్ తోనే దద్దరిల్లింది!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ లైగర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా సోషల్ మీడియాలో భారీ హైప్ ను క్రియేట్ చేస్తోంది. ఇక ఫైనల్ గా సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన లిరికల్ థీమ్ టీజర్ విడుదల చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

పవర్ఫుల్ బాక్సర్ పాత్రలో..
వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విజయ్ దేవరకొండ మొదటిసారి ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫస్టాఫ్ లో ఒక నేషనల్ బాక్సర్ గా సెకండాఫ్ లో ఇంటర్నేషనల్ బాక్సర్ గా అలరించబోతున్నాడు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైజన్ కూడా ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో నటించాడు.

అలా వాయిదా..
ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. అసలైతే ఈ సినిమాను గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఇతర సినిమాల రిలీజ్ డేట్స్ తో క్లాష్ అవుతుండడంతో సినిమాను వాయిదా వేసుకుంటూ వచ్చారు ఫైనల్ గా ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా..
ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా స్పీడ్ పెంచాలి అని చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఒక ప్రత్యేకమైన ద లైగర్ హంట్ థీమ్ లిరికల్ టీజర్ ను విడుదల చేశారు. సినిమాను తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. ఇక ఆ భాషల్లో కూడా అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఈ టీజర్ విడుదల చేయడం జరిగింది.

లైగర్ హంట్ థీమ్ సాంగ్
లైగర్ హంట్ థీమ్ సాంగ్ లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఫాస్ట్ బీట్ తో పూరి జగన్నాథ్ కల్ట్ మాస్ స్టైల్ లో ఉంది.
ఇక విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటోంది. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఊహించని విధంగా ఉంటుంది అని మరోసారి క్లారిటీ వచ్చేసింది.

అత్యధిక స్థాయిలో బిజినెస్
తప్పకుండా ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ తో ఒక క్లారిటీ వచ్చింది. ఇక ఇప్పుడు లిరికల్ టీజర్ తో అంచనాల స్థాయి మరింతగా పెరిగిపోయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన బిజినెస్ డీల్స్ కూడా దాదాపు ఫినిష్ అయ్యాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే లైగర్ అత్యధిక స్థాయిలో బిజినెస్ చేస్తోంది.

25న గ్రాండ్ రిలీజ్
ఇక వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. లైగర్ సినిమా ను ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నట్లుగా ఆఫీసర్గా క్లారిటీ కూడా ఇచ్చేశారు. కరణ్ జోహార్ పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సహా నిర్మాతగా ఛార్మి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండే నటించిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.