విజయ్ దేవరకొండతో క్రికెట్ ఆడి సందడి చేసిన ఐశ్వర్య.. వెరీ ఇంట్రెస్టింగ్

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కేఎస్ రామారావు సమర్పణలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌'. చిత్రంలో ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్ పోషించగా.. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌ ముఖ్యపాత్రలు పోషించారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

ఈ సందర్బంగా వేదికపై హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ''కౌసల్య కృష్ణమూర్తి నా కెరీర్‌లో తొలి తెలుగు సినిమా అవుతుందని ఊహించలేదు. దీనికంటే ముందే నేను విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సైన్ చేశాను. కానీ అనుకోకుండా నా డబ్యూ మూవీ కౌసల్య కృష్ణమూర్తి అయింది.

 Vijay Deverakonda Played cricket with Aishwarya Rajesh

నాపై నమ్మకముంచి 'కౌసల్య కృష్ణమూర్తి' అనే ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో నన్ను భాగం చేసినందుకు గాను కెఎస్ రామారావు గారికి స్పెషల్ థాంక్స్. ఈ సమయంలో మా నాన్న గారు ఉండుంటే చాలా ఆనందపడేవారు. ఇక డైరెక్టర్ భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఆగస్టు 23న థియేటర్స్‌లో కలుద్దాం. నేను తమిళ్‌లో పెద్ద రౌడీని.. ఇప్పుడు ఆ రౌడీతో ఈ రౌడీ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నాము'' అని చెబుతూ ఫన్నీ వాతావరణం క్రియేట్ చేసింది ఐశ్వర్య రాజేష్. అంతేకాదు వేదికపై విజయ్ దేవరకొండతో క్రికెట్ ఆడి సందడి చేసింది ఐశ్వర్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X