విజయ్ దేవరకొండ సాహసం.. యంగ్ ఏజ్‌లోనే అలాంటి పాత్రలో!
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది మూడు చిత్రాల్లో నటించిన విజయ్ కొండ ఈ ఏడాది అప్పుడే రెండు చిత్రాలని లైన్ లో పెట్టాడు. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రం ఒకటి కాగా, మరొకటి క్రాంతి మాధవ్ దర్శత్వంలో తెరకెక్కుతోంది. క్రాంతి మాధవ్ దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

క్రాంతి మాధవ్ దర్శత్వంలో
దర్శకుడు క్రాంతి మాధవ్ ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు లాంటి సున్నితమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండని క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేయనుండడంతో ఆసక్తి నెలకొంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి బోల్డ్, రొమాంటిక్ చిత్రాలతో అలరించిన విజయ్ దేవరకొండని క్రాంతి మాధవ్ ఎలా చూపించబోతున్నాడని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తండ్రి పాత్రలో
క్రాంతి మాధవ్ దర్శత్వంలో విజయ్ దేవరకొండ నటించే చిత్రం గురించి షాకింగ్ న్యూస్ ఒకటి ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ 8 ఏళ్ల పిల్లాడికి తండ్రిగా నటించబోతున్నాడట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపిస్తోంది. యంగ్ ఏజ్ లో ఉన్న విజయ్ దేవరకొండ అప్పుడే తండ్రి రోల్స్ చేయడం ఏంటని నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఏ కుర్ర హీరో కూడా తండ్రి పాత్రలో నటించడానికి ఇష్టపడడు. విజయ్ దేవరకొండ మాత్రం పెద్ద సాహసమే చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నలుగురు హీరోయిన్లు
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. రాశి ఖన్నా, ఇసాబెల్లా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. బలమైన కథ కావడంతో తండ్రి పాత్ర అయినా నటించడానికి విజయ్ దేవరకొండ అంగీకరించినట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డిలో మద్యానికి బానిసైన యువకుడిగా, గీత గోవిందం చిత్రంలో లెక్చరర్ గా, నోట చిత్రంలో రాజకీయ నాయకుడిగా నటించాడు. ఇప్పుడు తండ్రిగా మరో విభిన్నమైన పాత్ర చేస్తున్నాడు.

ముందుగా డియర్ కామ్రేడ్
ఈ రెండు చిత్రాలలో డియర్ కామ్రేడ్ చిత్రం ముందుగా విడుదలవుతుంది. డియర్ కామ్రేడ్ లో విజయ్ దేవరకొండ కార్మిక నాయకుడిగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్మిక మరోమారు ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తోంది. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











