‘నోటా’ రిలీజ్ మీద డ్రామాలు, డేట్ మీరే చెప్పండి: విజయ్ దేవరకొండ
'గీత గోవిందం' సినిమాతో బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకున్న విజయ్ దేవరకొండ వచ్చే దాసరాకి తన 'నోటా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రిలీజ్ డేట్ అక్టోబర్ 4 అనుకున్నప్పటికీ ఈ సినిమా సరిగ్గా ఏ డేట్ రోజు విడుదల చేయాలనే దానిపై విజయ్ అండ్ టీమ్ కాస్త అయోమయంలో ఉన్నారు. దీంతో నిర్ణయం అభిమానులకే వదిలేశారు.

'ఇది చాలా అర్జంట్, ఇంపార్టెంట్... సినిమా రిలీజ్ చేయడానికి కొన్ని మంచి రోజులున్నాయి. అదే విధంగా చెడ్డ రోజులు కూడా ఉన్నాయి. కానీ నోటా రిలీజ్ డేట్ విషయంలో చాలా డ్రామాలు జరుగుతున్నాయి.'' అంటూ విజయ్ వ్యాఖ్యానించారు.
నా సినిమాను మీరు ఎప్పుడు రిలీజ్ చేయమంటే అప్పుడే చేస్తాను... అంటూ ఓ పోల్ పెట్టి 4 ఆప్షన్లు ఇచ్చారు. అక్టోబర్ 5, అక్టోబర్ 10, అక్టోబర్ 18 మూడు ఆప్షన్లు కాగా నాలుగో అప్షన్ 'నోటా'(ఏదీ వద్దు) అని ఇచ్చారు. ఈ పోల్ ఫలితం ఆధారంగానే.... రేపు సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని విజయ్ దేవరకొండ తెలిపారు.
తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బేనర్లో కె.ఇ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు, అభిమానులు ముగ్ధులైపోతున్నారు. సినిమాపై అంచనాలు మరింత పెంచింది.
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. అనుకోకుండా సీఎం పీఠం ఎక్కిన విజయ్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు? రాజకీయ చదరంగంలో అతడు పావుగా మారాడా? లేక అందరినీ ఆటాడించాడా? అనే సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఈ చిత్రంలో మెహ్రీన్ జర్నలిస్టుగా కనిపించబోతోంది.


Click it and Unblock the Notifications











