ఆమె టాలెంట్‌కు విజయదేవరకొండ క్లీన్ బౌల్డ్.. వరుస ట్వీట్లతో విజృంభించిన అర్జున్ రెడ్డి

'ఆకాశం నీ హద్దురా' చూసిన తరువాత దాదాపు ఎనిమిది నెలల తరువాత ఒక మంచి సినిమా చూసిన ఫీల్ కలిగిందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కేవలం ఆడియెన్స్ అనే కాకుండా సెలబ్రెటీలు కూడా సినిమాపై చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటివరకు డైరెక్ట్ గా విడుదలైన ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో హిట్టవ్వలేదు. మొత్తానికి సూర్య కూడా తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక రౌడి స్టార్ విజయ్ దేవరకొండ కూడా తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

ముగ్గురు స్నేహితులు ఏడ్చేశారు

ముగ్గురు స్నేహితులు ఏడ్చేశారు

ఆకాశం నీ హద్దురా సినిమాను నేను పెద్ద గ్యాంగ్ తో చూశాను. అందులో ముగ్గురు స్నేహితులు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఏడ్చేశారు. ఈ సినిమా చూశాక ఒక తెలియని ఆవేశం కలిగింది. అలాగే ఒక బయట వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్ ఎప్పటికి సరైనది కాదు. ఈ సినిమా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్లు.. విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చారు.

 సూర్య, అపర్ణ నటన అద్భుతం

సూర్య, అపర్ణ నటన అద్భుతం


ఇక సూర్య నటన గురించి వివరణ ఇస్తూ.. ఆయన ఒక అద్భుతమైన నటుడు. ఆయన నటనను చూసిన తరువాత తప్పకుండా ప్రేమలో పడిపోతారు. ఇక నిర్మాతపై కూడా ఒక ప్రేమ కలుగుతుందని విజయ్ పేర్కొన్నాడు. ఇక హీరోయిన్ అపర్ణ బాలా కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకుందని ఇలాంటి అద్బుతమైన మహిళ డైరెక్టర్ సుధకు ఎక్కడ కనిపిస్తారో అని విజయ్ పాజిటివ్ గా కామెంట్ చేశారు

 దర్శకురాలితో వర్క్ చేయాలని ఉంది

దర్శకురాలితో వర్క్ చేయాలని ఉంది

సినిమాను డైరెక్ట్ చేసిన సుధ కొంగరపై ప్రశంసలు కురిపించిన విజయ్. నేను త్వరలో మీతో కలిసి పని చేస్తాను. ఇది డైరెక్టర్ గా మీ పట్ల నాకున్న ప్రశంసలను తెలియజేస్తోందని అన్నాడు.
ఇక జీవి.ప్రకాష్ కుమార్ టాప్ క్లాస్ మ్యూజిక్ అందించాడని, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చాలా గొప్పగా ఉందని అన్నారు. ఇక మిగిలిన తారాగణం కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నట్లు విజయ్ వివరణ ఇచ్చాడు.

Recommended Video

Psycho Varma: Pichodi Chetilo Rayi Song Teaser | Natti Kranthi
తప్పకుండా చూడాల్సిన సినిమా..

తప్పకుండా చూడాల్సిన సినిమా..


ఈ సినిమాలో నిజం ఎంత, కల్పితం ఎంత అనే విషయం నాకు తెలియదు. కాబట్టి కెప్టెన్ ప్రయాణం గురించి మరింత చదవడానికి సింప్లీ ఫ్లై పుస్తకాన్ని ఆర్డర్ చేస్తున్నట్లు చెబుతూ... అలాగే పరేష్ గోస్వామి వంటి వారిని వదిలిపారేయ్యండని చెప్పిన విజయ్ తెలుగు లేదా తమిళంలో తప్పకుండా చూడాల్సిన సినిమా 'ఆకాశం నీ హద్దురా' అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X