సినిమా ప్రమోషన్‌లో విజయ్ తీరే వేరు.. అదిరిపోయిన వీడియో సాంగ్
తన సినిమాలను ప్రమోట్ చేసుకునే తీరే విజయ్‌ను అందరి కంటే ప్రత్యేకంగా నిలిచేలా చేస్తుంది. అర్జున్ రెడి, గీతగోవిందం, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ సినిమాలను ఏవిధంగా జనాల్లోకి తీసుకెళ్లాడో అందరికీ తెలసిందే. అయితే అవన్నీ హీరోగా చేసిన తన సినిమాలనే అలా చేశాడంటే.. నిర్మాతగా మారి ఓ సినిమాను నిర్మిస్తే ఇంకెలా ప్రమోట్ చేస్తాడో ఊహించుకోవచ్చు.

తరుణ్ భాస్కర్ హీరోగా..
తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను.. తాను నిర్మాతగా మారి దర్శకుడిని హీరోగా చేశాడు. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్ లాంటి వారితో మీకు మాత్రమే చెప్తా అంటూ ఓ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశారు.

ఫోన్ చుట్టూ తిరిగే కథ..
ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్ ఉండటం సహజం.. ఆ ఫోన్‌లో ఏదో ఒక రహస్యం దాగి ఉంటుందనే నూతన పాయింట్‌ను తీసుకుని రాసుకున్న కథనం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో భాగంగా స్వయంగా రంగంలోకి దిగాడు.
నువ్వే హీరో అంటూ వీడియో సాంగ్..
ఈ మూవీని ప్రమోట్ చేసే క్రమంలో స్వయంగా రంగంలోకి దిగి స్టెప్పులు వేశాడు. నువ్వే హీరో అంటూ సాగే ఈ పాటకు విజయ్ అదిరిపోయే స్టెప్పులను వేసి అందర్నీ ఆకర్షించాడు. యథావిథిగా తనదైన స్టైలింగ్‌తో ఫ్యాన్స్‌కు కనువిందు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











