విజయ్ దేవరకొండ కుటుంబం పెద్దదైంది.. బన్నీ, మహేశ్ కంటే స్పీడుగా పెంచుకున్నాడు

By Manoj

చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్‌ను ఆరంభించాడు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా మారాడు. ఇందులో ఎంతో డీసెంట్‌గా కనిపించిన ఈ యంగ్ హీరో.. దాని తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి' మూవీలో మాత్రం రెచ్చిపోయి నటించాడు. ఈ సినిమాలో తనలోని మరో యాంగిల్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక, ఆ తర్వాత 'గీత గోవిందం'లో పూర్తి మేకొవర్ మార్చేశాడు. ఇలా సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన కుటుంబాన్ని పెద్దది చేసుకున్నాడు. ఇంతకీ ఈ సెన్సేషనల్ హీరో ఏం చేశాడు.? పూర్తి వివరాల్లోకి వెళితే...

అది మాత్రం బాగా నిరాశ పరిచింది

అది మాత్రం బాగా నిరాశ పరిచింది

‘అర్జున్ రెడ్డి', ‘గీత గోవిందం' సినిమాలతో విజయ్ దేవరకొండ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. దీంతో అతడితో సినిమాలు చేసేందుకు ఫిల్మ్ మేకర్లు పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ‘డియర్ కామ్రేడ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. ఈ సినిమా మాత్రం ఆశించినంత స్థాయిలో ఆడలేదు. దీంతో అతడి ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

నలుగురు హీరోయిన్లకు ఒక్కడే

నలుగురు హీరోయిన్లకు ఒక్కడే

‘డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తోంది. ఇందులో విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్‌, రాశీ ఖన్నా, ఇజబెల్లె లైట్, కేథరిన్‌ నటిస్తున్నారు. ఈ సినిమా లవర్స్ డే రోజు విడుదల కానుంది.

 ఈ సారి భారీ టార్గెట్ పెట్టుకున్నాడు

ఈ సారి భారీ టార్గెట్ పెట్టుకున్నాడు

ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత విజయ్ దేవరకొండ.. పూరీ జగన్నాథ్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతోంది. కరణ్ జోహార్ సమర్పణలో రూపొందనున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.

 విజయ్ కుటుంబం పెద్దదైంది

విజయ్ కుటుంబం పెద్దదైంది

సినిమాల్లోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే విజయ్ దేవరకొండ భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో అతడు యూత్ ఐకాన్ అయిపోయాడు. ఈ క్రమంలోనే ఈ క్రేజీ హీరో సోషల్ మీడియాలోకి ప్రవేశించాడు. వీటిలో ముఖ్యంగా విజయ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్స్ గణనీయంగా పెరిగిపోతున్నారు. తాజాగా ఈ సంఖ్య యాభై లక్షలకు చేరుకుంది.

బన్నీ, మహేశ్ కంటే స్పీడుగా పెంచుకున్నాడు

బన్నీ, మహేశ్ కంటే స్పీడుగా పెంచుకున్నాడు

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ మినహా టాలీవుడ్‌కు చెందిన ఏ హీరో కూడా యాభై లక్షల ఫాలోవర్లను చేరుకోలేదు. అతడి తర్వాతి స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (46 లక్షలు), సూపర్ స్టార్ మహేశ్ బాబు (38 లక్షలు), దగ్గుబాటి రానా (34 లక్షలు) ఉన్నారు. వీరి తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అఖిల్, రామ్ తదితరులు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X