twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏ హీరోకు, నిర్మాతకు ఈ దుస్థితి రావొద్దు: తన సినిమా లీక్‌పై విజయ్ దేవరకొండ ఎమోషనల్

    By Bojja Kumar
    |

    Recommended Video

    Geetha Govindam Movie Team Press Meet

    సినిమా రిలీజ్ ముందే 'గీత గోవిందం' లీక్ అవ్వడంపై ఆ చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. వైజాగ్‌లో నిర్వహిస్తున్న గీత గోవిందం ప్రీ రిలీజ్ వేడుక కోసం వచ్చిన ఆయన మీడియా సమావేశంలో రష్మికతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు సినిమా లీకేజీ వ్యవహారంపై అడగటంతో విజయ్ ఎమోషనల్ అయ్యారు. ఇలాంటివి జరిగినపుడు చాలా బాధేస్తుందని, ఇలాంటి పరిస్థితి ఏ హీరోకూ, నిర్మాతకు రాకూడదన్నారు.

    నేను మొదలు పెడితే ఏం మాట్లాడతానో తెలియదు

    నేను మొదలు పెడితే ఏం మాట్లాడతానో తెలియదు

    ఇలాంటివి జరిగినపుడు బాధ అవుతుంది. దీని గురించి ఇపుడు మాట్లాడొద్దు అనుకుంటున్నాను. రైట్ టైమ్ వచ్చినపుడు మాట్లాడతాను. నేను ఇపుడు మొదలు పెడితే ఏం మాట్లాడతానో నాకే తెలియదు. పెద్దలు అరవింద్ గారు అందరూ ఉండి చెబితే బావుంటుందనేది తన ఉద్దేశ్యమన్నారు.

     17 మందిని అదుపులోకి తీసుకున్నారు

    17 మందిని అదుపులోకి తీసుకున్నారు

    ప్రస్తుతం ఇవ్వెస్టిగేషన్ జరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్ర రిజియన్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇప్పటి వరకు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. సైబర్స్ టీమ్స్ అన్నీ రంగంలోకి దిగాయి. ఎక్కడ ఎవరు దీన్ని షేర్ చేస్తున్నారో వెంటనే ఆ ఐపీ అడ్రస్ ట్రేస్ చేసి పట్టుకుంటున్నారు. పోలీసులు చాలా సపోర్ట్ ఇస్తున్నారు.... అని విజయ్ తెలిపారు.

     ఇలా ఎవరిరీ జరుగొద్దు

    ఇలా ఎవరిరీ జరుగొద్దు

    ఇలా ఎవరికీ జరుగొద్దు. నాకు సినిమాలే కొత్త... ఇలాంటి సంఘటనలు ఇంకా కొత్త. ఇలా ఎందుకు చేస్తారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ సంఘటనను నేను జీర్ణించుకోలేక పోతున్నాను... అని విజయ్ అన్నారు.

     త్వరలో ప్రెస్ మీట్లో అన్ని విషయాలు చెబుతాం

    త్వరలో ప్రెస్ మీట్లో అన్ని విషయాలు చెబుతాం

    ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడే ఏం మాట్లాడదలుచుకోలేదు. ప్రస్తుతానికి చిన్న చిన్న క్లిప్పులు సర్క్యులేట్ అవుతున్నాయి. త్వరలోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గత వారం రోజులుగా ఏం జరిగిందో మొత్తం చెబుతామని విజయ్ తెలిపారు.

     రాజేష్ అనే వ్యక్తి ద్వారా లీక్

    రాజేష్ అనే వ్యక్తి ద్వారా లీక్

    గుంటూరు జిల్లా చీరాలకు చెందిన పడవల రాజేష్‌ అనే వ్యక్తి పైరసీ చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో డేటా డిజిటల్‌ బ్యాంకు అడ్మిన్‌గా రాజేష్‌ పని చేస్తున్నాడు. ఎడిటింగ్‌ కోసం ఇచ్చిన హార్డ్‌డిస్క్‌లోని డేటాను తన ల్యాప్‌టాప్‌లోకి ఎక్కించుకున్నాడు. అనంతరం కాపీ చేసిన ‘గీత గోవిందం' సినిమాను పెన్‌ డ్రైవ్‌ ద్వారా తోటి స్నేహితులైన ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పంపాడు.

    English summary
    Vijay Devarakonda Reacts On Geetha Govindam Movie Piracy. Geetha Govindam starring Vijay Devarkonda and Rashmika Mandanna, is slated to on 15th August, got a shocker as scenes of the movie are circulating in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X