డాక్టర్ వద్దకు వెళ్లు విజయ్ దేవరకొండ.. అవసరం లేదమ్మా మీ ప్రేమ చాలు!
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు రోజు రోజుకు క్రేజ్ పెరుగుతూనే ఉంది. విజయ్ దేవరకొండ క్రేజ్ కు అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలు ఓ కారణం అయితే.. అతడి నటన, యాటిట్యూడ్ మరో కారణం. సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటూ తన చిత్ర విశేషాలని విజయ్ పంచుకుంటున్నాడు. గత ఏడాది విజయ్ కు చాలా లక్కీ అని చెప్పొచ్చు. గీత గోవిందం ద్వారా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన నోటా నిరాశపరిచిన మళ్ళీ టాక్సీవాలాతో పుంజుకున్నాడు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్.

షూటింగ్‌లో గాయం
కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ షూటింగ్ సందర్భంగా గాయపడ్డాడు. ట్రైన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ట్రాక్ పై పడి స్వల్ప గాయాలయ్యాయి. విజయ్ దేవరకొండకు గాయాలైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. విజయ్ దేవరకొండ గాయాల గురించి కూడా చిన్నపిల్లల్లో చర్చ జరుగుతోంది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు విజయ్ క్రేజ్ ఎలా ఉందొ అని.
ముద్దు ముద్దుగా
ఇద్దరు చిన్నారులు వాళ్ళ నాన్న ఫోన్ లో ఉన్న విజయ్ దేవరకొండని చూశారు. ఆ ఫొటోలో విజయ్ గాయాలతో కనిపిస్తున్నాడు. దీనితో విజయ్ దేవరకొండకు ఏమైంది నాన్న అని అడిగారు. షూటింగ్ లో గాయాడ్డాడు అని వాళ్ల నాన్న చెప్పగా.. ఏం చేద్దాం అని పాప అడుగుతుంది. దీనితో వాళ్ళ నాన్న చెప్పిన దాని ప్రకారం.. విజయ్ దేవరకొండ ఫోటో వైపు చూస్తూ డాక్టర్ వద్దకు వెళ్లి విజయ్ దేవరకొండ అని ముద్దు ముద్దుగా సలహా ఇస్తారు. ఈ వీడియో నెటిజన్లనే కాదు విజయ్ దేవరకొండని సైతం ఫిదా చేసింది.

అవసరం లేదమ్మా
విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. మీ ప్రేమలో పడిపోయా.. విజయ్ దేవరకొండకు ఇక డాక్టర్ అవసరం లేదు. కానీ మీ ఇద్దరినీ నేను కలవాలని అనుకుంటున్నా.. కలుస్తారు కదూ అంటూ విజయ్ ఆ చిన్నారులని ట్విట్టర్ వేదికగా అడిగాడు. సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ హవా ఈ విధంగా ఉంది. ఇటీవలే విజయ్ దేవరకొండ ఫోర్బ్స్ జాబితాలో కూడా స్థానం దక్కించుకున్నాడు.

కార్మికుల నేపథ్యంలో
విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రం కార్మికుల నేపథ్యంలో తెరకెక్కుతోంది. భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకుడు. డియర్ కామ్రేడ్ లో విజయ్ స్టూడెంట్ గా, కార్మికుడిగా కనిపించబోతున్నాడు. విజయ్ కు జోడిగా గీత గోవిందం బ్యూటీ రష్మిక నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











