నిఖిల్‌కి థాంక్స్ చెప్పిన విజయ్ దేవరకొండ!
చాలా రోజులుగా వాయిదాపడుతూ వస్తున్న విజయ్ దేవరకొండ టాక్సీవాలా చిత్రం నవంబర్ 17న విడుదల కాబోతోంది. విడుదలకు ముందే ఈ చిత్ర పైరసీ లీక్ కావడం పెద్దషాక్. చిత్ర యూనిట్ మొత్తం పైరసీ ఆన్లైన్ లో ప్రత్యక్షం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో యంగ్ హీరో నిఖిల్ టాక్సీవాలా చిత్రానికి మద్దత్తుగా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.
పైరసీని ఎంకరేజ్ చేయవద్దు అంటూ అభిమానులని కోరాడు. నిఖిల్ ట్వీట్ కు విజయ్ దేవరకొండ స్పందించాడు. పైరసీకి వ్యతిరేకంగా టాక్సీవాలా చిత్రానికి సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ యంగ్ హీరోల మధ్య విభేదాలు ఉన్నాయంటూ గతంలో ప్రచారం జరిగింది.

పరస్పర ట్వీట్స్ తో ఈ హీరోలిద్దరూ ఆ వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. ఈ ఏడాది గీత గోవిందం, నోటా చిత్రాలతో అలరించిన విజయ్ దేవరకొండ మరోమారు టాక్సీవాలాగా రాబోతున్నాడు. డెబ్యూ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఈ చిత్రంలో నటించింది.


Click it and Unblock the Notifications











