మొదట తేజు, ఆ తర్వాత విజయ్ దేవరకొండ.. రూమర్లకు చెక్ పెట్టాడు!

Recommended Video

Vijay Devarakonda Responds On Rumours That He Is Doing Gully Boy Remake || Filmibeat Telugu

రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన గల్లీ బాయ్ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయం సాధించింది. బాలీవుడ్ ప్రముఖ మహిళా దర్శకురాలు జోయా అక్తర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గల్లీ బాయ్ రీమేక్ హక్కులకు మంచి డిమాండ్ నెలకొని ఉంది. గల్లీ బాయ్ చిత్రాన్ని దక్షణాది భాషల్లో రీమేక్ చేసేందుకు పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో గల్లీ బాయ్ రీమేక్ లో నటించబోతున్నట్లు టాలీవుడ్ యువ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి.

ఖండించిన తేజు

ఖండించిన తేజు

గల్లీ బాయ్ తెలుగు రీమేక్ లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. చిత్రలహరి తర్వాత తేజు గల్లీ బాయ్ రీమేక్ లో నటిస్తాడని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ తాను ఇంతవరకు గల్లీ బాయ్ చిత్రమే చూడలేదని, ఇక రీమేక్ లో ఎలా నటిస్తాను అని క్లారిటీ ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్ ప్రకటనతో అవన్నీ ఊహాగానాలు మాత్రమే అని తేలిపోయింది.

విజయ్ దేవరకొండతో సంప్రదింపులు

విజయ్ దేవరకొండతో సంప్రదింపులు

గల్లీ బాయ్ తెలుగు రీమేక్ విషయంలో మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఈ చిత్ర రీమేక్ లో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఓ నిర్మాత గల్లీ బాయ్ రీమేక్ హక్కులని సొంతం చేసుకుని, విజయ్ దేవరకొండతో సంప్రదింపులు ప్రారంభించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొట్టింది. రణవీర్ సింగ్ నటించిన పాత్రకు విజయ్ సరిపోతాడని అంటున్నారు.

 రూమర్లకు చెక్

రూమర్లకు చెక్

గల్లీ బాయ్ చిత్రంలో నటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై విజయ్ దేవరకొండ వైపు నుంచి సమాధానం వెంటనే వచ్చింది. ఈ ఊహాగానాలు మరింత ఎక్కువగా కాకుండా విజయ్ దేవరకొండ చెక్ పెట్టాడు. తాను గల్లీ బాయ్ రీమేక్ లో నటించడం లేదని తేల్చేశాడు. విజయ్ సన్నిహితులు చేబోతూ.. విజయ్ దేవరకొండకు ఎలాంటి రీమేక్ చిత్రంలో నటించే ఆసక్తి లేదని, ప్రస్తుతం తాను చేస్తున్న చిత్రాలపై మాత్రమే దృష్టి పెట్టాడని అంటున్నారు.

డియర్ కామ్రేడ్

డియర్ కామ్రేడ్

ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. గీత గోవిందం తర్వాత మరోసారి విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ఇది. ఇటీవల విడులైన టీజర్ లో రష్మిక, విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్ హాట్ టాపిక్ గా మారింది. మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X