నేను చేస్తున్నవన్నీ ఛీప్ థ్రిల్స్.. కరణ్ జోహార్ ఇంట్లో కూర్చున్నప్పుడు.. విజయ్ దేవరకొండ!

Recommended Video

Taxiwala Movie Team Chit Chat : Vijay Deverakonda Hilarious Fun

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలపట్ల యువత ఎక్కువా ఆసక్తి చూపిస్తున్నారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండ ఎక్కువగా ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా విజయ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ ఏడాది విజయ్ దేవరకొండ మూడవ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీత గోవిందం చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తరువాత వచ్చిన నోటా చిత్రం నిరాశపరిచింది. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న టాక్సీవాలా చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

మూడోసారి వస్తున్నాడు

మూడోసారి వస్తున్నాడు

ఈ ఏడాది విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న మూడో చిత్రం టాక్సీవాలా. విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించారు. రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకుడు. యువి క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది.

ఛీప్ థ్రిల్స్

ఛీప్ థ్రిల్స్

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాల గురించి వ్యాఖ్యలు చేశాడు. నోటా చిత్రంతో విజయ్ తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. తాను హిందీ సినిమా చేసే అవకాశం కూడా ఉందంటూ హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం నేను చేస్తున్న చిత్రాలన్నీ ఛీప్ థ్రిల్స్ అని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. అన్ని భాషల్ని టచ్ చేస్తా.. ఎందుకు చేయకూడదు అంటూ వ్యాఖ్యానించాడు.

కరణ్ జోహార్‌తో చిత్రం

కరణ్ జోహార్‌తో చిత్రం

తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తో జరిగిన సమావేశం గురించి ప్రస్తావించాడు. ముంబై వెళ్ళినప్పుడు కరణ్ జోహార్ ని కలిశా. నేనేంటి ఆయన ఇంట్లో కూర్చునా అని అనిపించింది. అవకాశం వస్తే హిందీలో కూడా సినిమా చేస్తానని విజయ్ దేవరకొండ తెలిపాడు.

హీరోయిన్‌తో సరదాగా

హీరోయిన్‌తో సరదాగా

ఈ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కు సరదాగా సలహాలు ఇచ్చాడు. టాక్సీవాలా చిత్రాన్ని ప్రియాంక కథని బట్టి ఎంచుకుంది తెలిపాడు. అలాగే ఫ్యూచర్ లో కూడా పెద్ద హీరోతో సినిమా చేయాలి అని కాకుండా కథని బట్టి సినిమాలు ఎంపిక చేసుకోవాలని విజయ్ ప్రియాంకకు సలహా ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X