ఆగస్టులో అర్జున్ రెడ్డి విడుదల: ఇప్పటికే పిచ్చెక్కేలా ఉన్నారు

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'అర్జున్ రెడ్డి' చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్దమయ్యింది. ర‌ధ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో త్వర‌లో మార్కట్లోకి విడుద‌ల కానుంది.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'అర్జున్ రెడ్డి' టీజర్ విడుదల మొదలుకొని విశేషమైన క్రేజ్ సంపాదించుకొన్నది. ఈ మధ్యే విడుదలైన ఈ చిత్ర టీజర్ రొటీన్ ఫార్మాట్ కు భిన్నంగా ఉండటమే కాక యువతను ఆకట్టుకునే విధంగా కూడా ఉండటంతో ఈ సినిమాపై అద్భుతమైన స్పందనను దక్కించుకుంది. అంతేగాక ఈ ఒక్క టీజర్ సినిమాపై భారీ స్థాయి అంచనాలను కూడా పెంచింది.

అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డి

షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్దమయ్యింది. ‘అర్జున్ రెడ్డి'. టీజర్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో నెమ్మదిగా ఈ సినిమా వార్తల్లోంచి వెళ్లిపోయింది. టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తే సినిమాకది అడ్వాంటేజ్ అవుతుంది.

Recommended Video

Pawan Kalyan's Remuneration Rs.1 Cr For 1 Day!
మంచి రెస్పాన్స్ వ‌చ్చింది

మంచి రెస్పాన్స్ వ‌చ్చింది

పోస్టర్స్‌, టీజ‌ర్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై వ‌చ్చిన అంచ‌నాల‌కు త‌గ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజెనెస్‌కు క్రేజ్ ఏర్పడింది. విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి 2 చిత్రాన్ని విడుద‌ల చేసిన ఏషియ‌న్ ఫిలింస్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు. ర‌ధ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో త్వర‌లో మార్కట్లోకి విడుద‌ల కానుంది.

యారోగెంట్ మెడిక‌ల్ స్టూడెంట్

యారోగెంట్ మెడిక‌ల్ స్టూడెంట్

విల‌క్షణ పాత్రలు చేయ‌డానికి ఆస‌క్తి చూపే విజ‌య్ దేవ‌ర కొండ ఈ చిత్రంలో యారోగెంట్ మెడిక‌ల్ స్టూడెంట్ పాత్రలో క‌న‌ప‌డ‌బోతున్నాడు. మంచి ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ ఏషియ‌న్ ఫిలింస్‌తో పాటు కె.ఎఫ్‌.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగ‌స్ట్ చివ‌రి వారంలో విడుద‌ల చేస్తున్నాయి.

పెళ్లిచూపులు కన్నా ముందు కథ

పెళ్లిచూపులు కన్నా ముందు కథ

వైవిధ్యభరితమైన కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కింది. తన కెరియర్ కి ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. ‘పెళ్లిచూపులు' విడుదలవడానికంటే ముందు మొదలైన సినిమా ‘అర్జున్ రెడ్డి'.

చిన్న సినిమాగా మొదలుపెట్టారు

చిన్న సినిమాగా మొదలుపెట్టారు

చాలా తక్కువ బడ్జెట్లో చిన్న సినిమాగా దీన్ని మొదలుపెట్టారు. ఐతే ‘పెళ్లిచూపులు' తర్వాత విజయ్ ఇమేజ్ మారిపోవడం.. పైగా ‘అర్జున్ రెడ్డి' టీజర్ కు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం.. సినిమా మీద అంచనాలు పెరగడంతో చిత్ర యూనిట్ కు కొంచె ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్లుంది.

స్క్రిప్టులో కొంచెం మార్పులు

స్క్రిప్టులో కొంచెం మార్పులు

సినిమా బడ్జెట్ పెంచి.. ఫారిన్ లొకేషన్లకు కూడా వెళ్లి సినిమాను షూట్ చేశారు. స్క్రిప్టులో కూడా కొంచెం మార్పులు చేసినట్లు సమాచారం. నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ వంగ నిర్మిస్తుండగా ‘అందాల రాక్షసి' ఫేమ్ రాధన్ సంగీతం, తోట రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X