»   » ‘పెళ్లి చూపులు’ హీరోకు... అభిమాని ఆత్మహత్య బెదిరింపు! చివరకు ఏమైందంటే...

‘పెళ్లి చూపులు’ హీరోకు... అభిమాని ఆత్మహత్య బెదిరింపు! చివరకు ఏమైందంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'పెళ్లి చూపులు' మూవీతో పాపులర్ అయిన తెలుగు హీరో విజయ్ దేవర కొండ త్వరలో 'అర్జున్ రెడ్డి' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించక పోవడం, ఇంకా ఆలస్యం చేస్తుండటంతో ఓ అభిమాని సోషల్ మీడియా ద్వారా హీరోను బెదిరించాడు.

సినిమాను త్వరగా రిలీజ్ చేయకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా అంటూ రౌతు సాయి రామ్ అనే అభిమాని ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ షేర్ చేసాడు. అలాంటి పిచ్చి పనులు చేయొద్దని, నాకు దయ్యాలంటే చాలా భయం... సినిమా రిలీజ్ అయిన వెంటనే నీకు తప్పకుండా రెండు టికెట్స్ పంపిస్తాను అంటూ అతన్ని వారించే ప్రయత్నం చేసాడు.


ఆత్మహత్య చేసుకుంటా

ఆత్మహత్య చేసుకుంటా అంటూ.... రౌతు సాయిరామ్ అనే అభిమాని.... హీరో విజయ్ దేవరకొండకు పంపిన సందేశం ఇదే. ఇదంతా కేవలం సరదాగా జరిగిన కన్వర్జేషన్ అయినప్పటికీ.... కేవలం సినిమా రిలీజ్ కోసం చచ్చిపోతానంటూ పోస్టులు చేయడం ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు.


అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డి

భ్రదకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ దర్శకత్వంలో ప్రణయ్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ సరసన షాలిని హీరోయిన్ గా నటిస్తుంది.టీజర్

న్యూఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. హీరో హీరోయిన్ ముద్దు సీన్ తో ఈ పోస్టర్ ఉండటం విశేషం. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి.


ముద్దు సీన్ ప్రాక్టీస్

సినిమా ప్రారంభానికి ముందే ముద్దు సీన్ ప్రాక్టీస్ చేసే వీడియో క్లిప్ రిలీజ్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్, మంగళూర్, డెహ్రడూన్, ఢిల్లీతో పాటు ఇటలీలో చిత్రీకరణ చేస్తున్నారు. చిత్రానికి యువ సంగీత దర్శకుడు రధన్ సంగీతాన్ని అందిస్తుండగా, నగేష్ బన్నేల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


డిఫరెంట్ లవ్ స్టోరీ

డిఫరెంట్ లవ్ స్టోరీ

డిఫరెంట్ లవ్ అండ్ యాక్షన్ స్టోరీ తో రూపొందనున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సినిమా ఫస్ట్ లుక్, టీజర్... ఇలా అన్నింటిలోనూ తెలుగు ప్రేక్షకలు ఊహించని సీన్లు ఉండటంతో ఈచిత్రం హాట్ టాపిక్ అవుతోంది.English summary
Vijay Devarakonda's fan Routhu Sairam suicide warning for Arjun Reddy movie release. "Routhu Sairam I promise you 2 tickets to the movie when it releases.Naku asale dayalu ante bhayam." Vijay Devarakonda replies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu