twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ దేవరకొండ రికార్డు బడ్జెట్.. భారీ ప్లాన్‌తో పూరీ, కరణ్ జోహర్ కసరత్తు

    |

    Recommended Video

    Fighter As a Pan India Film With Record Budget | Filmibeat Telugu

    వరుస విజయాలతో దూసుకెళ్లిన యువ హీరో విజయ్ దేవరకొండ స్పీడ్ తగ్గినట్టు కనిపిస్తున్నది. విజయ్ నటించిన సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టినా బాక్సాఫీస్ వద్ద కాసుల రాల్చలేకపోతున్నాయి. డియర్ కామ్రేడ్ మంచి వసూళ్లు రాబట్టినా.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టినట్టు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పూరి జగన్నాథ్ సినిమాపైనే విజయ్ దేవరకొండ ఆశలు పెట్టుకొన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. అయితే ఈ సినిమాకు సంబంధించిన లేటేస్ట్ అప్‌డేట్ ఫ్యాన్స్‌లో జోష్ పెంచింది. వివరాల్లోకి వెళితే..

     ప్యాన్ ఇండియా మూవీగా

    ప్యాన్ ఇండియా మూవీగా

    వర్కింగ్ టైటిల్ ఫైటర్‌గా ప్రచారంలో ఉన్న సినిమాను పూరీ జగన్నాథ్ ప్యాన్ ఇండియాగా మూవీగా మార్చేశాడు. ఆరంభంలో సౌత్‌కే పరిమితమైన ప్రాజెక్ట్ ఇప్పుడు పలు భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం రూపొందుతున్నది. అయితే ఈ సినిమా బడ్జెట్ ముందు అనుకున్నదాని కంటే ఎక్కువగానే పెరిగిపోయిందని, ప్యాన్ ఇండియా మూవీ కావడంతో కొత్త నటీనటులు చేరిక కూడా అవసరమైందనే మాట వినిపిస్తున్నది.

    కరణ్ జోహర్ హ్యాండ్‌తో

    కరణ్ జోహర్ హ్యాండ్‌తో

    ఫైటర్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్ చేరడంతో మూవీ స్వరూపమే మారిపోయిందనే మాట వినిపిస్తున్నది. చార్మీ పర్యవేక్షణలో పూరీ కనెక్ట్స్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ హిందీ కోసం చేతులు కలిపింది. దాంతో ఈ సినిమా బడ్జెట్‌ను రూ.50 కోట్లకు పైగానే పెరిగిపోయిందనే టాక్ ప్రస్తుతం మీడియాలో వైరల్ అయింది. అయితే పలు భాషల్లో విజయ్‌కి ఉన్న క్రేజ్ ముందు ఈ బడ్జెట్ రిస్క్ కాదనే మాట వినిపిస్తున్నది.

    రూ.50 కోట్ల బడ్జెట్‌తో

    రూ.50 కోట్ల బడ్జెట్‌తో

    అయితే ప్యాన్ ఇండియా మూవీకి రూ.50 కోట్ల బడ్జెట్ అనేది చాలా సర్వసాధారణం. కానీ స్టార్ హీరోలు కాకుండా దిగువ శ్రేణి స్టార్ల సినిమాకు రూ.50 కోట్లు ఎక్కువ అనే మాట వినిపిస్తున్నది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో చూసుకొంటే ఈ బడ్జెట్ అత్యధికమే అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, ఈ సినిమా బిజినెస్‌ను అన్ని లాంగ్వేజ్‌లో కూడా భారీ స్థాయిలో జరుగుతున్నట్టు సమాచారం.

    ఫైటర్? లైగర్?

    ఫైటర్? లైగర్?

    ఇక ఫైటర్ చిత్రంలో బాలీవుడ్ నటి అనన్య పాండే జాయిన్ అయింది. తాజాగా ఆమె షూటింగ్‌లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండతో కలిసి పలు సన్నివేశాల్లో పాల్గొన్నట్టు సమాచారం. విజయ్ దేవరకొండతో నటించడం చాలా హ్యాపీగా ఉందని అనన్య పాండే సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దానికి విజయ్ దేవరకొండ కూడా స్పందించిన సంగతి తెలిసిందే.

     అక్టోబర్ చివరివారంలో రిలీజ్

    అక్టోబర్ చివరివారంలో రిలీజ్

    ఇక ఫైటర్ టైటిల్‌ను మార్చే పనిలో ఉన్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ సినిమామకు లైగర్ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే తెలుస్తున్నది. ఈ టైటిల్ వెనుక ఆసక్తికరమైన కథ ఉండటంతో లైగర్‌నే ఖారారు చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని అక్టోబర్ చివరి వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    After serial flops, Vijay Devarakonda is getting ready with Fighter movie. This movie is going with Rs.50 crores budget which Directed by Puri Jagannadh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X