twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంకేం ఇంకే కావాలంటున్న విజయ్ దేవరకొండ.. గీతా గోవిందం సాంగ్ రిలీజ్

    By Rajababu
    |

    Recommended Video

    ఇంకేం ఇంకే కావాలంటున్న విజయ్ దేవరకొండ.. గీతా గోవిందం సాంగ్ రిలీజ్

    అర్జున్ రెడ్డి చిత్రం తో స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న చిత్రం గీత‌గొవిందం. ఈ చిత్రానికి సంబందించి మెద‌టి సింగిల్ ని ఇప్పుడు తాజాగా "ఇంకేం ఇంకేం కావాలి" అనే మెలోడియస్ ని విడుదల చేసింది చిత్ర బృందం. గోపి సుందర్ అద్భుతమైన మెలోడియస్ సాంగ్స్ అందించారు. సిడ్ శ్రీరామ్ ఈ అద్భుతమైన పాటను ఆలపించారు.

    అనంత శ్రీరామ్ అందమైన పదాలతో ఈ పాటను రచించారు. ఈ చిత్రం లో ఛలో హీరోయిన్ ర‌ష్మిక మందాన్న గీత పాత్ర‌లో న‌టిస్తున్నారు. గీతాఆర్ట్స్ లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ తో విజ‌యం సాధించిన ప‌రుశురాం(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో... శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు.

    పక్కా ఫ్యామిలీ సినిమా

    పక్కా ఫ్యామిలీ సినిమా

    చిత్ర స‌మ‌ర్ప‌కులు శ్రీఅల్లు అర‌వింద్ మాట్లాడుతూ.. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గీత‌గోవిందం లో మెద‌టి సాంగ్ ని విడుద‌ల చేశాము. మంచి మెలోడి గా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పోందుతుంది. పక్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ప‌రుశురాం మంచి టేస్ట్ వున్న ద‌ర్శ‌కుడు. హీరోయిన్ ర‌ష్మిక పాత్ర పేరు గీత‌.. ఈ చిత్రం త‌ర్వాత త‌న‌ని గీత అని పిలుస్తారు అంత‌బాగా న‌టించింది. గోపిసుంద‌ర్ సంగీతం బాగుంది. చిత్రంలోని ఇంకేం ఇంకేం కావాలి సాంగ్ విడుదల చేశాం. అగ‌ష్టు 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. అని అన్నారు.

    రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ మూవీ

    రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ మూవీ

    ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌ (బుజ్జి) మాట్లాడుతూ.. మా గీతగోవిందం చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. గీతగోవిందం చిత్రాన్ని రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ముందుకు అగ‌ష్టు 15న తీసుకువ‌స్తున్నాం. శ్రీ అల్లు అరవింద్ గారి బ్లెస్సింగ్స్ తో బ‌న్ని వాసు స‌పోర్ట్ తో ఈ చిత్రం చాలా బాగా వ‌చ్చింది.

    గోవిందం అని పిలుస్తారు

    గోవిందం అని పిలుస్తారు

    టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ స్టార్ విజ‌య్ దేవ‌ర కొండ గోవిందంగా అంద‌ర్ని అల‌రిస్తాడు. ర‌ష్మిక త‌న పాత్ర లో ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేసింది. చిత్రంలోని ఇంకేం ఇంకేం కావాలే సాంగ్ విడుదల చేశాం. మంచి మెలోడీ సాంగ్. గోపి సుందర్ మంచి ఆల్బమ్ ఇచ్చారు. అన్ని పాటలు అనిముత్యాల్లా ఉంటాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అగ‌ష్టు 15 న మీ ముందుకు వస్తాం. అని అన్నారు.

     యూత్‌ను ఆకట్టుకునే విధంగా

    యూత్‌ను ఆకట్టుకునే విధంగా

    నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ.. శ్రీ అల్లు అర‌వింద్ గారు చిత్ర స‌మ‌ర్ప‌కులు గా నేను నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రం గీత‌గోవిందం. ఈ చిత్రం లో మా గోవిందం అలియాస్ విజ‌య్ దేవ‌రకొండ సూప‌ర్ ఫెర్‌ఫార్మెన్స్ తో మ‌రోక్క‌సారి ప్రేక్ష‌కుల ముఖ‌చిత్రాన్ని త‌న‌వైపుకు తిప్పుకుంటాడ‌నే న‌మ్మ‌కం మాకుంది. ప‌రుశురాం కి ఫ్యామిలీ ఎమోష‌న్స్ ని తెర‌కెక్కించ‌టం వెన్న‌తో పెట్టిన విధ్య. గోపిసుంద‌ర్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. ఇప్పుడు విడుదల చేసిన ఇంకేం ఇంకేం కావాలే అనే సాంగ్ చాలు... పాటలకు ఎంత ప్రాధాన్యం వుందో. గీత గోవిందం చేసే అల్ల‌రి యూత్ ని ఆక‌ట్టుకుంటాయి. అగ‌ష్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం.. అని అన్నారు.

    న‌టీన‌టులు..

    విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన్న, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మౌర్యాని, సుభాష్‌, అభ‌య్‌, స్వ‌ప్న‌క‌, స‌త్యం రాజేష్‌, దువ్వాసి మెహ‌న్‌, గుండు సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, అనీష‌, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, సంధ్య జ‌న‌క్ త‌దిత‌రులు...

    సాంకేతిక నిపుణులు..

    సాంకేతిక నిపుణులు..

    స‌మ‌ర్ప‌కులు.. అల్లు అర‌వింద్‌
    నిర్మాత‌.. బ‌న్నివాసు
    క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం... ప‌రుశురామ్‌
    సంగీతం.. గోపిసుంద‌ర్‌
    సినిమాటోగ్రాఫ‌ర్‌.. మ‌ణికంద‌న్‌
    ఎడిట‌ర్‌.. మార్తాండ్‌.కె.వెంక‌టేష్
    ఆర్ట్‌.. ర‌మ‌ణ వంక‌
    ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. స‌త్య గ‌మిడి
    స్క్రిప్ట్ కొ-ఆర్డినేట‌ర్‌.. సీతారామ్‌
    లిరిక్స్‌.. అనంత్ శ్రీరామ్‌, శ్రీమ‌ణి,
    కొరియోగ్రాఫి... ర‌ఘు, జాని
    ప‌బ్లిషిటి డిజైన‌ర్‌.. అనిల్ భాను

    English summary
    Inkem Inkem Inkem Kaavaale Lyrical Song From Telugu Movie Geetha Govindam released today. Starring Vijay Devarakonda Rashmika Mandanna. Music Composed by Gopi Sundar, Produced by Bunny Vas and Directed by Parasuram, Under the banner of GA2 Pictures.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X