విజయ్ దేవరకొండ రేంజి చాలా పెరిగింది... రూ. 8 కోట్ల ఖర్చుతో?

తెలుగు సినిమా సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరుస హిట్లతో వేగంగా తారాపతం వైపు దూసుకెళుతున్నాడు. 'గీత గోవిందం' సినిమాతో రూ. 100 కోట్లు వసూలు చేసే సత్తా ఉన్న హీరోగా నిరూపించుకున్న విజయ్ ఇపుడు ఇండస్ట్రీలో హాట్ కేక్. దేవరకొండ ఉంటే చాలు కోట్ల కలెక్షన్ కురుస్తుండటంతో బడా నిర్మాణ సంస్థలు అతడితో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నాయి.

రెండు రోజుల క్రితమే విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'హీరో' అనే చిత్రం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. న్యూ డైరెక్టర్ ఆనంద్‌ అన్నామలై దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌ వారు నిర్మించబోతున్నారు. తాజాగా మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

ప్రొఫెషనల్‌ బైకర్‌ పాత్రలో విజయ్

ప్రొఫెషనల్‌ బైకర్‌ పాత్రలో విజయ్

‘హీరో' మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బైకర్ పాత్రలో కనిపించబోతున్నారట. సినిమా కోసం బైక్ రేసింగులో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ చేసిన సినిమాలన్నింటికంటే హయ్యెస్ట్ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారట.

బైక్ స్టంట్ కోసం రూ. 8 కోట్ల ఖర్చు?

బైక్ స్టంట్ కోసం రూ. 8 కోట్ల ఖర్చు?

సినిమాలో బైక్ స్టంట్‌తో కూడా భరీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని, సినిమా మొత్తానికే హైలెట్ అయ్యేలా దీన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం రూ. 8 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట. ఢిల్లీలో బైక్ స్టంట్ చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. నిన్న మొన్నటి వరకు విజయ్ నటించిన సినిమాల బడ్జెట్ కూడా రూ. 8 కోట్లు దాటలేదు. ఇప్పుడు ఏకంగా ఒక్క సీన్ కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెడుతుండటం చర్చనీయాంశం అయింది.

విజయ్ రేంజి చాలా పెరిగింది

విజయ్ రేంజి చాలా పెరిగింది

ఇపుడు విజయ్ దేవరకొండ సినిమాల రేంజి చాలా పెరిగింది. హిట్ టాక్ వస్తే చాలు కనీసం రూ. 50 కోట్లు వసూలు చేసే సత్తా వచ్చింది. ఆ నమ్మకంతోనే నిర్మాతలు ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టడానికి వెనకాడటం లేదు. ఇక ‘మైత్రి మూవీ మేకర్స్' లాంటి సంస్థలు బరిలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

విజయ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

విజయ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

‘పెళ్లి చూపులు' చిత్రానికి విజయ్ దేవరకొండ రూ. 5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ‘అర్జున్ రెడ్డి' బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రెమ్యూనరేషన్ రూ. 5 కోట్లకు చేరుకుంది. ‘గీత గోవిందం' బ్లాక్ బస్టర్ విజయం తర్వాత విజయ్ ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు చార్జ్ చేస్తున్నాడట.

హీరో

హీరో

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో `హీరో` సినిమా తెర‌కెక్క‌నుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారి ఇలాంటి డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీలో న‌టిస్తున్నారు. పేట్ట ఫేమ్ మాళ‌వికా మోహ‌న‌న్ ఈ చిత్రం టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్ర‌దీప్‌ కుమార్ సంగీతం అందించ‌బోయే ఈ చిత్రానికి ముర‌ళి గోవింద రాజు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో దిగంత్ మ‌చాలే, వెన్నెల కిషోర్‌, శ‌ర‌ణ్ శ‌క్తి, రాజా కృష్ణ‌మూర్తి(కిట్టి), జాన్ ఎడ‌త‌ట్టిల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X