వైరల్ వీడియో: ఎంగేజ్మెంట్ రింగుతో ఆమెకు ప్రపోజ్ చేసిన విజయ్ దేవరకొండ!
Recommended Video

విజయ్ దేవరకొండకు చెందిన ఓ ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రేమికుడిగా కనిపించిన విజయ్ తన గర్ల్ ఫ్రెండ్ మలోబికా బెనర్జీతో రొమాన్స్ చేస్తున్నట్లు ఉంది. వీడియో చివర్లో ఈ తన మోకాళ్ల మీద నిల్చుని ఎంగేజ్మెంట్ రింగుతో ప్రమోజ్ చేయడం గమనార్హం.
అయితే ఈ సెటప్ అంతా కూడా నటనే. విజయ్ దేవరకొండ, మలోబికా బెనర్జీ జంటగా ఓ ప్రైవేట్ మ్యూజిక్ వీడియో ఆల్బం విడుదల చేశారు. 'టాక్సీవాలా' హిట్ టాక్ తర్వాత విడుదలైన ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

‘నీ వెనకాలే నడిచి'
‘నీ వెనకాలే నడిచి' పరుతో విడుదలైన ఆ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బం సౌరభ్, దుర్గేష్ కంపోజ్ చేశారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ప్రముఖ గాయని చిన్మయి పాడారు. భానుశ్రీ తేజ దీన్ని డైరెక్ట్ చేశారు.

యువతకు తెగ నచ్చేసింది
ఈ వీడియో ఆల్బం గోవాలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. యువతకు.. ముఖ్యంగా ప్రేమలో ఉన్న వారికి ఈ ఆల్బం తెగ నచ్చేసింది. సోమవారం సాయంత్రం దీన్ని విడుదల చేయగా కొన్ని గంటల్లోనే 5 లక్షలకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

మలొబికా బెనర్జీ
మలొబికా బెనర్జీ బెంగాలీ నటి. గతంలో మిస్ కోల్‌కతా టైటిల్ సైతం దక్కించుకుంది. కొన్ని బెంగాళీ, ఒరియా చిత్రాల్లో నటించింది. తెలుగులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ విషయానికొస్తే అతడు నటితంచిన ‘టాక్సీవాలా' ఇలీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం విజయ్ ‘డియర్ కామ్రేడ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











