పెళ్లి చూపులు హీరో... ముద్దు సీన్‌తో షాకిచ్చాడు: ‘అర్జున్ రెడ్డి’ మూవీ పోస్టర్
న్యూఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. హీరో హీరోయిన్ ముద్దు సీన్ తో ఈ పోస్టర్ ఉండటం విశేషం.
హైదరాబాద్: 'పెళ్లి చూపులు' సినిమా ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవర కొండ త్వరలో 'అర్జున్ రెడ్డి' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భ్రదకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ దర్శకత్వంలో ప్రణయ్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షాలిని హీరోయిన్ గా నటిస్తుంది.
న్యూఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. హీరో హీరోయిన్ ముద్దు సీన్ తో ఈ పోస్టర్ ఉండటం విశేషం. డిఫరెంట్ లవ్ అండ్ యాక్షన్ స్టోరీ తో రూపొందనున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

ఈ చిత్రాన్ని హైదరాబాద్, మంగళూర్, డెహ్రడూన్, ఢిల్లీతో పాటు ఇటలీలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు రధన్ సంగీతాన్ని అందిస్తుండగా, నగేష్ బన్నేల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.



Click it and Unblock the Notifications











