»   »  పెళ్లి చూపులు హీరో... ప్రేమకులరోజు ఏం చేసాడో చూడండి (అర్జున్ రెడ్డి టీజర్ )

పెళ్లి చూపులు హీరో... ప్రేమకులరోజు ఏం చేసాడో చూడండి (అర్జున్ రెడ్డి టీజర్ )

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'పెళ్లి చూపులు' సినిమా ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవర కొండ త్వరలో 'అర్జున్ రెడ్డి' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భ్రదకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ దర్శకత్వంలో ప్రణయ్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షాలిని హీరోయిన్ గా నటిస్తుంది.

న్యూఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. హీరో హీరోయిన్ ముద్దు సీన్ తో ఈ పోస్టర్ ఉండటం విశేషం. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసారు.

అర్జున్ రెడ్డి టీజర్


అర్జున్ రెడ్డి టీజర్

rn

షాకింగ్ సీన్లు

డిఫరెంట్ లవ్ అండ్ యాక్షన్ స్టోరీ తో రూపొందనున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సినిమా ఫస్ట్ లుక్, టీజర్... ఇలా అన్నింటిలోనూ తెలుగు ప్రేక్షకలు ఊహించని సీన్లు ఉండటంతో ఈచిత్రం హాట్ టాపిక్ అవుతోంది.

 ముద్దు సీన్ ప్రాక్టీస్

ముద్దు సీన్ ప్రాక్టీస్

ఈ చిత్రాన్ని హైదరాబాద్, మంగళూర్, డెహ్రడూన్, ఢిల్లీతో పాటు ఇటలీలో చిత్రీకరణ చేస్తున్నారు. చిత్రానికి యువ సంగీత దర్శకుడు రధన్ సంగీతాన్ని అందిస్తుండగా, నగేష్ బన్నేల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

 అంచనాలు భారీగానే

అంచనాలు భారీగానే

ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పెళ్లి చూపులు సినిమా హిట్ కావడంతో విజయ్ దేవరకొండ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. దీంతో పాటు అర్జున్ రెడ్డి పోస్టర్, టీజర్ ఆసక్తికరంగా ఉండటం కూడా సినిమాకు ప్లస్.

English summary
Vijay Devarakonda's Upcoming Flim Arjun Reddy Teaser released. Arjun Reddy is the Title of Vijay Deverakonda's next film. Produced by Bhadrakali pictures. The film is written and directed by Sandeep Vanga, Radhan scores the music and Nagesh Bannel handles cinematography.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu