ఇంకో లవ్ ఫెయిలా?? మరో లవ్ స్టోరీలో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా ‘ఏ మంత్రం వేసావె’ అనే కొత్త సినిమా మొదలయ్యింది. ఈ చిత్రాన్ని శ్రీధర్ మర్రి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు.
టాలీవుడ్ మొత్తానీ ఒక కుదుపు కుదిపాడు విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి అనే సినిమాలో విజయ్ నటన ఒక్క రోజులో అతన్ని మోస్ట్ వాంటెడ్ హీరో ఆఫ్ టాలీవుడ్ గా మార్చేసింది. ఇప్పుడు వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు ఈ అబ్బాయి. విజయ్..మరోసారి ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. శ్రీధర్ మర్రి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఏం మంత్రం వేసావెలో హీరోగా నటించనున్నాడు.
విజయ్ హీరోగా 'ఏ మంత్రం వేసావె' అనే కొత్త సినిమా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని శ్రీధర్ మర్రి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అందులో విజయ్ తప్ప ఇంకెవరూ లేరు. అతడి లుక్ చాలా ప్లెజెంట్‌గా ఉంది ఈ సినిమాలో. ఇదో లవ్ స్టోరీ అనీ, ఈ చిత్రం దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుందనీ, త్వరలోనే విడుదల అని కూడా ప్రకటించేశారు.

ఈ చిత్రాన్ని 'గోలీసోడా ఫిలిమ్స్' బేనర్ మీద ముగ్గురు కొత్త నిర్మాతలు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులందరూ కూడా కొత్త వాళ్లే. ఇది 'అర్జున్ రెడ్డి విడుదల కంటే ముందు విజయ్ కమిటైన సినిమా. మరోవైపు పరశురామ్, భరత్ కమ్మల దర్శకత్వంలోనూ విజయ్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
నందిని రెడ్డి సినిమా అతి త్వరలోనే మొదవుతుంది. రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విజయ్ ఇందులో క్యాబ్ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. కామిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా అనంతపురంకు చెందిన ప్రియాంక జవాల్కర్ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











