twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాసూ మీరు సూపర్: విజయ్ దేవరకొండ, సంపూర్ణేష్ బాబు గొప్ప మనసుపై ప్రశంసలు!

    |

    టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. . తిత్లీ తుపాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు తనవంతు సాహాయం అందించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. సంపూర్ణేష్ బాబు సైతం రూ. 50 వేల సహాయం అందించారు.

    ప్రస్తుతం లేహ్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.... తిత్లీ తుపాన్ గురించి తెలుసుకుని వెంటనే స్పందించారు. అభిమానులు కూడా తమ వంతు సహాయం అందించడానికి ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు.

    విజయ్ దేవరకొండ ట్వీట్

    రూ. 5 లక్షల విరాళం అందించిన అనంతరం.... అభిమానులను సైతం ఇందులో భాగం కావాలని కోరుతూ విజయ్ దేవరకొండ ట్వీట్. గతంలో కేరళ వరద బాధితుల కోసం కూడా విజయ్ అందరి కంటే ముందు రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.

    అందరి కంటే ముందుగా సంపూ


    తిత్లీ విషయంలో అందరి కంటే ముందుగా సంపూర్ణేష్ బాబు రియాక్ట్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా తిత్లి తుఫాన్ వల్ల చాలా నష్టం జరిగింది అని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను.....వెంటనే మన వంతు సాయంగా చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటున్నాను. నా వంతుగా Rs.50,000/- ఆర్థిక సాయం ముఖ్యమంత్రి గారి సహాయనిధి కి అందజేస్తాను... అని ప్రకటించారు.

    ఈ ఇద్దరు స్టార్లపై ప్రశంసల వెల్లువ

    ఈ ఇద్దరు స్టార్లపై ప్రశంసల వెల్లువ

    తిత్లి తుఫాన్ నేపథ్యంలో.... తెలుగు వారికి సహాయం చేయడంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రియాక్ట్ అవ్వడంతో పాటు విరాళం అందించిన ఈ ఇద్దరు స్టార్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

    అనిల్ రావిపూడి

    విజయ్ దేవరకొండ ట్వీట్‌పై రియాక్ట్ అవుతూ దర్శకుడు అనిల్ రావిపూడి నేను కూడా ఇందులో జాయిన్ అవుతున్నట్లు ప్రకటించారు.

    English summary
    Vijay Devarakonda come forward for the help of the people, who are suffering from Cyclone Titli. Yesterday Vijay Devarakonda wrote on his Twitter, “The news just reached me in Leh. This time it’s our own. Let’s join in. Every contribution is massive.You did it last time with me for Kerala, let’s do it one more time. I stand with you Andhra Pradesh and so will a lot of my people. #CycloneTitli.” Tollywood actor Sampoornesh Babu made a donation of 50,000 Rs towards AP CMRF and he was the first person to respond from the film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X