తమ్ముడిచ్చిన ఆర్థిక బలమే నాకు పునాది.. విజయ్ దేవరకొండ భావోద్వేగం

Recommended Video

Vijay Devarakonda Emotional Speech About His Brother Anand Devarakonda || Filmibeat Telugu

కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దొరసాని'. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ల క్రిందటి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యశ్‌ రంగినేని, మధుర శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రానికి దగ్గుబాటి సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని 'దొరసాని' పై అంచనాలు పెంచేశాయి. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిన్న (ఆదివారం) ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది చిత్రయూనిట్.

విజయ్ దేవరకొండ స్పీచ్

విజయ్ దేవరకొండ స్పీచ్

ఆదివారం రాత్రి అశేష అభిమానుల మధ్య 'దొరసాని' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఎప్పటిలాగే అభిమానుల్లో జోష్ నింపుతూ సాగింది విజయ్ దేవరకొండ స్పీచ్. ఈ వేదికపై తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడిన ఆయన భావోద్వేగానికి గురయ్యాడు.

తమ్ముడి గురించి గొప్పగా

తమ్ముడి గురించి గొప్పగా

దొరసాని వేదికపై తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి గొప్పగా చెప్పాడు విజయ్ దేవరకొండ. తన తమ్ముడితో ఉన్న అనుబంధం ప్రత్యేకమైందని తెలిపాడు. ఆనంద్ దేవరకొండ విదేశాలకు వెళ్లి తమకు డబ్బు పంపించేవాడని, అతనిచ్చిన ఆర్ధిక బలంతోనే తోనే తాను హీరోగా ఎదిగాననని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.

 విజయ్ దేవరకొండ భావేద్వేగం

విజయ్ దేవరకొండ భావేద్వేగం

తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి చెబుతున్న సమయంలో కొద్దిసేపు భావోద్వేగానికి గురయ్యాడు విజయ్ దేవరకొండ. తమ్ముడు చేసిన సహాయాన్ని గుర్తు తెచ్చుకొని కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఆ తర్వాత మళ్ళీ తనలో తానే దైర్యం తెచ్చుకొని తిరిగి స్పీచ్ ప్రారంభించాడు. ఆ రోజు అతను చేసిన సహాయమే తనను ఈ రోజు ఇలా నిలబెట్టిందని విజయ్ చెప్పాడు.

ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వస్తే..

ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వస్తే..

తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వస్తే తాను ఎంకరేజ్ చేయలేదని అన్నాడు. అతనే ఎలాగోలా జిమ్ములకెళ్లి, ఏదోలా సినిమా అవకాశం పట్టేసి దొరసాని సినిమా చేశాడని అన్నారు. అయితే తన బాధ్యతను తన భుజాలపై వేయాలని తాను ఇప్పటిదాకా ఏ మాత్రం సపోర్ట్ చేయాలని పేర్కొంటూ కన్నీరు పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ.

కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు

కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు

సినిమా చేస్తున్నపుడు హీరో హీరోయిన్లకు కాన్ఫిడెన్స్ ఉండాలి తప్ప ఎవ్వరు సపోర్ట్ చేసినా అది వృధానే అని విజయ్ అన్నాడు. తనను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా రమ్మంటే.. తాను సినిమా చూశాకే వస్తానని చెప్పా అని, ఈ సినిమాలో ఆనంద్, శివాత్మిక మ్యాజిక్ చేశారని విజయ్ పేర్కొన్నారు. వాళ్ళ నటన చూసి నా మొదటి సినిమాలో కూడా నేను ఇలా నటించలేదు అనిపించింది. 'దొరసాని' సినిమా సూపర్‌గా వచ్చిందని విజయ్ పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X