కన్నడ సినీతారలు, క్రికెటర్లపై విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్.. నాకు 100.. ఆయనకు 800..!

By Rajababu

Recommended Video

కన్నడ సినీతారలు, క్రికెటర్లపై అర్జున్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి ఘన విజయాలతో క్రేజీస్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ హవా దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీగానే నడుస్తున్నది. కన్నడ నటుడు గణేష్ నటించిన చమక్ చిత్ర ఆడియో ఆవిష్కరణకు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆడియో ఆవిష్కరణ అనంతరం విజయ్ మాట్లాడుతూ కన్నడ ప్రముఖుల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసి ఆకట్టుకొన్నారు. విజయ్ ఏమన్నారంటే...

 కర్ణాటక అనగానే..

కర్ణాటక అనగానే..

కర్ణాటక అనగానే రాహుల్ ద్రావిడ్, జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ లాంటి ప్రముఖ క్రికెటర్లు వెంటనే గుర్తుకు వస్తారు. భారత జట్టులో ఎక్కువ మంది కర్ణాటక నుంచే ఉంటారు. ఒక్క క్రికెట్ కాదు.. ఏ రంగానికి చెందిన వారైనా అంకితభావంతో సేవలందిస్తారు.

 రజనీకాంత్, అనుష్క..

రజనీకాంత్, అనుష్క..

సినిమాల గురించి ఆలోచించగానే బాహుబలి లాంటి చిత్రంతో పాపులర్ అయిన అనుష్కశెట్టి కర్ణాటక నుంచి వచ్చిందని తెలుస్తుంది. ఇంకా సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ లాంటి వారిని కూడా ఈ రాష్ట్రమే అందించింది. త్వరలోనే రష్మిక మందన కూడా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నది.

 నాకు మతిపోతుంది.. ఎనర్జిటిక్‌గా

నాకు మతిపోతుంది.. ఎనర్జిటిక్‌గా

‘ప్రస్తుత కన్నడ సినిమాల్లోని కంటెంట్‌, స్టైల్‌ను చూస్తే నాకు మతిపోతుంది. వాటిని చూసి నేను ఎనర్జిటిక్‌గా ఫీలవుతాను. సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్‌ నటించిన ‘మఫ్టి' చిత్రం ట్రైలర్‌ చూశాను. ఆ చిత్రాన్ని చూసిన తర్వాత గ్యాంగ్‌స్టర్‌ చిత్రంలో నటించాలని అనిపించింది అని కర్ణాటక రాష్ట్రాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.

గణేష్ సినిమాతో గర్వం

గణేష్ సినిమాతో గర్వం

పెళ్లిచూపులు చిత్రం 100 రోజుల ఆడిన ర్వాత ఏ హీరో సినిమా ఎన్ని రోజులు ఆడింది అనేది చూస్తుంటే గోల్డెన్ స్టార్ గణేష్ నటించిన ఓ చిత్రం 800 రోజులు ఆడిందని తెలుసుకున్నాను. గణేష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. గణేష్ సినిమా అన్ని రోజులు ఆడిందని తెలుసుకొన్న తర్వాత నాకున్న గర్వం అణిగింది. ఇలాంటి నటులను, క్రికెటర్లను అందించిన కన్నడ రాష్ట్రానికి ధన్యవాదాలు అని విజయ్ అన్నారు.

 రష్మిక మందనతో విజయ్

రష్మిక మందనతో విజయ్

అర్జున్ రెడ్డి తర్వాత ప్రస్తుతం విజయ్ మూడు నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాడు. పరుశురాం దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి టాక్సీవాలా అనే పేరు పరిశీలనలో ఉంది. మరోపక్క ఏ మంత్రం వేశావె చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇందులో విజయ్‌కి జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X