ఆదుకోవాల్సిన టైమ్‌లో... పక్కకు తప్పుకున్న విజయ్ దేవరకొండ!

Recommended Video

Is Vijay Devarakonda Upset With Dear Comrade Result ? || Filmibeat Telugu

విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన 'డియర్ కామ్రేడ్' జులై 26న గ్రాండ్‌గా విడుదలైంది. రిలీజ్ ముందు వరకు సౌతిండియా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే కనిపించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, వైజాజ్ ఇలా అన్ని ఏరియాలు తిరుగుతూ ఓ రేంజిలో సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్, ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ విజయ్, రష్మిక మామూలు హడావుడి చేయలేదు. అయితే సినిమా రిలీజైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రిలీజ్ రోజు ఈ చిత్రానికి మిక్డ్స్ టాక్ రావడంతో.... ప్రమోషనల్ ఈవెంట్స్ ఆపేశారు.

పట్టించుకోకుండా వదిలేశారు

పట్టించుకోకుండా వదిలేశారు

వాస్తవానికి సినిమా తొలిరోజు యావరేజ్ టాక్ వచ్చింది. ఇలాంటి సమయంలో సినిమా ప్రమోషన్స్ బాగా చేస్తే మూవీ గట్టెక్కే అవకాశం ఉండేదని, అయితే దీన్ని పట్టించుకోకుండా వదిలేయడం వల్లే అది ప్లాప్ సినిమాల లిస్టులో చేరిపోయిందనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వ్యక్తం అవుతున్నాయి.

ఆ ఫలితాన్ని విజయ్ జీర్ణించుకోలేక పోతున్నారా?

ఆ ఫలితాన్ని విజయ్ జీర్ణించుకోలేక పోతున్నారా?

‘డియర్ కామ్రేడ్' ఫలితాన్ని విజయ్ దేవరకొండ జీర్ణించకోలేక పోతున్నారని, అందుకే సినిమాకు యావరేజ్ రెస్పాన్స్ రావడంతో పూర్తిగా సైడ్ అయిపోయారని టాక్. జులై 26న ‘డియర్ కామ్రేడ్ నేడు రిలీజ్ అవుతోంది' అనే ట్వీట్ తర్వాత సినిమా గురించి ఆయన ఎలాంటి ట్వీట్ చేయలేదు.

బాలీవుడ్ స్థాయిలో చేశారు కానీ...

బాలీవుడ్ స్థాయిలో చేశారు కానీ...

సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్లు మొదలై.. ఆ తర్వాత కూడా కంటిన్యూ అవూతూ ఉంటాయి. అయితే ‘డియర్ కామ్రెడ్' విషయంలో విజయ్ దేవరకొండ భిన్నంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. బాలీవుడ్ తరహాలో.... భారీ ఈవెంట్స్ చేశారు. తాము ఇంత కష్టపడ్డా పలితం ఇంత దారుణంగ ఉండటంతో విజయ్ అప్ సెట్ అయ్యారట.

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మరో రెండు చిత్రాలకు కమిటైనట్లు తెలుస్తోంది. ‘డియర్ కామ్రేడ్' చేదు ఫలితాన్ని మరిచిపోయి తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో విజయ్ బిజీ అయినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X