For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ విషయంలో హామీ ఇస్తే.. నేను మీకు అండగా ఉంటాను.. పూరిపై విజయ్ దేవరకొండ స్పెషల్ కామెంట్!

  |

  డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈరోజు తన 55వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఇక అతనితో గతంలో పనిచేసిన హీరోలు మరియు పరిశ్రమలోని సన్నిహితులు స్నేహితులు ఈ ప్రత్యేక రోజున స్పెషల్ గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక హీరో విజయ్ దేవరకొండ కూడా తనదైనా శైలిలో పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు విషెస్ అందిస్తూ ఒక ఫ్రెండ్ తరహాలో పాజిటివ్ గా వివరణ ఇచ్చారు. తన సోషల్ మీడియా ఖాతాలో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ తో ఉన్న కొన్ని ఫొటోలను కూడా రిలీజ్ చేశాడు.

  మరో లెవల్ కు వెళ్లాలని..

  మరో లెవల్ కు వెళ్లాలని..

  విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి కచ్చితంగా ఈ సినిమాతో సక్సెస్ అందుకుని మరో లెవల్ కు వెళ్లాలని పూరి తో పాటు విజయ్ దేవరకొండ కూడా గట్టిగానే కష్టపడుతున్నాడు. సినిమాకు సంబంధించిన పోస్టర్ అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో బాగానే పడుతున్నాయి.

  ఒక స్నేహితుడిగా..

  ఒక స్నేహితుడిగా..

  ఇక నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ప్రత్యేకమైన పోస్ట్ చేశాడు. మీరు నేను కలుసుకోవడం.. ఒక గమ్యస్థానం. మనం రెండు సంవత్సరాల క్రితం కలవడం జరిగింది. మీరు నా డైరెక్టర్‌గా మారారు. ఒక యాక్టర్ నేను నన్ను నిరూపించుకోవడానికి ఒక పెద్ద ప్లే గ్రౌండ్ విస్తరించారు. ఇక నాకు సంతోషంలో బాధలో కూడా ఒక స్నేహితుడిగా కూడా ఉన్నారు. అనేక రకాల పిచ్చి పనుల్లో ఉన్నప్పుడు నాకు ఒక గార్డియన్ లాగా కూడా ఉన్నారు.

  మీకు అండగా ఉంటాను

  మీకు అండగా ఉంటాను

  మరొక ట్వీట్‌లో విజయ్ ఇంకా ఇలా పేర్కొన్నాడు.. మేము ఇంకా భారీ కలలను పంచుకుంటాము. వచ్చే ఏడాది ఈ ప్రపంచం మర్చిపోలేనిదాన్ని అందిస్తాము. ఐ లవ్ యూ పూరి జగన్నాథ్ సర్. జన్మదిన శుభాకాంక్షలు, మీరు ఆరోగ్యంగా ఉంటామని హామీ ఇస్తే.. మనసులను ఉర్రూతలూగించడానికి నేను మీకు అండగా ఉంటాను.. అని విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చారు.

  స్పెషల్ ఫొటోలు రిలీజ్

  స్పెషల్ ఫొటోలు రిలీజ్

  విజయ్ నుండి వచ్చిన ఈ మాటలకు దర్శకుడు పూరి జగన్నాథ్ శైలి అతన్ని ఎలా ప్రభావితం చేశాయో అర్ధమవుతోంది. అంతే కాకుండా పూరితో విజయ్ మాట్లాడుతున్న కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసుకున్నాడు. ఆ ఫొటోలో విజయ్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. అతని మొహం మీద గాయం అయినట్లుగా ఉంది. చూస్తుంటే షూటింగ్ లో చాలా సరదాగా మాట్లాడుకుంటున్నట్లు ఉన్నారని అనిపిస్తోంది.

  Liger - Boxing Legend Mike Tyson In Vijay Deverakonda's Liger
  స్పెషల్ పాత్రలో మైక్ టైసన్

  స్పెషల్ పాత్రలో మైక్ టైసన్

  ఇక ఈ సినిమాను ఇదే ఏడాది విడుదల చేయాలని అనుకున్నప్పటికి ప్రస్తుతం పరిస్థితుల కారణంగా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేశారు. ఇక నిన్న సాయంత్రం బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ ప్రాజెక్ట్‌లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన మొదటి పాటను త్వరలోనే విడుదల చేస్తారుని ఒక టాక్ అయితే వస్తోంది. ఈ సినిమాకు పూరితో పాటు బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

  English summary
  Vijay devarakonda special birthday wishes to puri Jagannadh
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X