twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా సినిమాలేవీ సరిగ్గా విడుదల కావు.. కేసులు పెడుతున్నారు.. విజయ్ దేవరకొండ!

    |

    యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరోమారు నోటా చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కొన్ని నెలల క్రితమే విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఏ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో గీత గోవిందం చిత్రం ఒకటిగా నిలిచింది. ప్రత్యేకమైన శైలితో విజయ్ దేవరకొండ యువతలో భారీ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంటున్నాడు. విజయవాడలో ఆదివారం రోజు నోటా పబ్లిక్ మీట్ జరిగింది. సోమవారం రోజు హైదరాబాద్ లో పబ్లిక్ మీట్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. మరోమారు విజయ్ దేవరకొండ తన స్పీచ్ తో అదరగొట్టాడు.

    <strong>ఊర్లో ఉంటే నేనూ నా బర్రెలు... కేటీఆర్‌ ఫ్రెండ్ అనుకుంటే నా తప్పే: విజయ్ దేవరకొండ </strong>ఊర్లో ఉంటే నేనూ నా బర్రెలు... కేటీఆర్‌ ఫ్రెండ్ అనుకుంటే నా తప్పే: విజయ్ దేవరకొండ

     నా సినిమాలు ఎప్పుడూ అంతే

    నా సినిమాలు ఎప్పుడూ అంతే

    విజయ్ దేవరకొండ తన ప్రసంగాన్ని ఆరంభిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా సినిమాల విడుదలకు ఎప్పుడూ తిప్పలు తప్పవు అంటూ వివాదాల గురించి ప్రస్తవించాడు. అర్జున్ రెడ్డి చిత్రం విడుదలకు ముందు వివాదం కాగా, గీత గోవిందం చిత్రం విడుదలకు ముందే పైరసీ జరిగిన సంగతి తెలిసిందే.

     రాద్ధాంతం

    రాద్ధాంతం

    నోటా చిత్రం విషయంలో కొంతమంది అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఈ చిత్ర ప్రభావం ఉంటుందని అంటున్నారు. ప్రజలు నోటాకు ఓటు వేసే అవకాశాలు ఉన్నాయని ఈ చిత్రాన్ని ఆపాలని చూస్తున్నారని విజయ్ దేవరకొండ తెలిపాడు.

     కేసులు పెడుతున్నారు

    కేసులు పెడుతున్నారు

    ఈ సినిమా తెలంగాణాలో ఓ పార్టీకి అనుకూలంగా ఉందని కూడా కొందరు కోర్టులో ఫిటిషన్ లు దాఖలు చేస్తున్నారని విజయ్ దేవరకొండ తెలిపాడు. కానీ వారనుకునట్లుగా ఈ చిత్రంలో అలాంటి విషయాలు ఏవీ లేవు. నోటాకు ఓటేయమని ఈ చిత్రంలో చెప్పడం లేదు అంటూ విజయ్ దేవరకొండ తెలిపాడు.

    కక్కుర్తి పడవద్దు

    కక్కుర్తి పడవద్దు

    విజయ్ దేవరకొండ తనదైన శైలిలో ప్రసంగాన్ని ముగించాడు. ఆడియన్స్ అందరి చేత ప్రమాణం చేయించాడు. ఎన్నికల్లో 2000, 3000 లకు కక్కుర్తి పడకుండా ఓటేయాలని కోరడం విశేషం. నోటా చిత్రం అక్టోబర్ 5 న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ రాజకీయ నాయకుడి పాత్రలో, ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు.

    English summary
    Vijay Devarakonda Speech at Hyderabad Nota Public meet. Nota movie ready to release on 5th October
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X