ఫ్యామిలీ స్టార్ సెన్సార్ టాక్: విజయ్ దేవరకొండ కెరీర్‌లో బెస్ట్.. అదే జరిగితే హిట్ కొట్టినట్టే!
అసలు సినిమా నేపథ్యమే లేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోగా మారిపోయాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. హీరోగా పరిచయమైన కొత్తలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నాడు. ఈ జోష్‌లోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అయితే వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్' మూవీ చేశాడు. ఈ సినిమా సెన్సార్ టాక్ ఎలా ఉందో మీరే చూసేయండి మరి!
ఫ్యామిలీ స్టార్‌గా విజయ్
విజయ్ దేవరకొండ - పరశురాం కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమానే 'ఫ్యామిలీ స్టార్'. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.

ప్రమోషన్స్ జెట్ స్పీడ్
నటించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీని ఈ ఏడాది సంక్రాంతికే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అప్పుడు సాధ్యం కాకపోవడంతో ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇక, దీనికి సమయం దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడుగా సాగిస్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని ఈవెంట్లు, ఇంటర్వ్యూలనూ సైతం పూర్తి చేసుకున్నారు.
ఆ సర్టిఫికెట్ వచ్చిందా
ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఫ్యామిలీ స్టార్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో నిర్మాణానంతర కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. ఇలా ఇటీవలే ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు వీక్షించినట్లు తెలిసింది. అంతేకాదు, దీనికి సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చేసింది.

రన్ టైమ్ ఎంతంటే
విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం రూపొందించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీకి సంబంధించిన రన్ టైం వివరాలు కూడా తాజాగా తెలిశాయి. ఈ సమాచారం ప్రకారం.. ఈ మూవీ 2 గంటల 40 నిమిషాల (160 నిమిషాలు) పాటు ఉండబోతుందని తెలిసింది. అంటే సాధారణంగా వచ్చే సినిమాల కంటే చాలా ఎక్కువ రన్ టైంతోనే విజయ్ దేవరకొండ చిత్రం వస్తుందని చెప్పాలి.
సెన్సార్ రివ్యూ ఇలా
క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ నటించిన 'ఫ్యామిలీ స్టార్' సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డ్ సభ్యులు ఫిదా అయ్యారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ముఖ్యంగా ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే డ్రామా అదిరిపోయేలా వచ్చిందని అంటున్నారు. అంతేకాదు, సినిమా క్లైమాక్స్ కూడా ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందని సమాచారం.

టాక్ వస్తే మూవీ హిట్టే
ఆ మధ్య వరుస హిట్లతో సత్తా చాటిన విజయ్ దేవరకొండ.. గత చిత్రాల ఫలితాలతో డీలా పడిపోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో 'ఫ్యామిలీ స్టార్' మూవీ చేశాడు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ చేసిన ఈ సినిమాకు సెన్సార్ టాక్ బాగున్నట్లు తెలిసింది. ఇదే మౌత్ టాక్ రూపంలో వస్తే కచ్చితంగా అతడు హిట్ కొట్టే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications











