జోరు మీదున్న విజయ్ దేవరకొండ, సన్నీలియోన్.. సల్మాన్ ఖాన్ ఫార్ములా!
సినీ తారలంటే ఎప్పుడూ వార్తల్లో ఉండడం అవసరం. తమ చిత్రాలకు సంబందించిన విషయాలని తరచుగా మీడియాతో పంచుకుంటుంటే అభిమానుల్లో కూడా ఆసక్తి అలాగే ఉంటుంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంతటి స్టార్ హీరోకు ప్రచారం అవసరం లేదు. మీడియానే అతడికి ప్రచారం కల్పిస్తుంది. కానీ సల్లూభాయ్ అభిమానుల కోసం, వారితో మమేకం కావడం కోసం ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. అదే బాటని చాలా మంది నటీనటులు అనుసరిస్తున్నారు. ఆ జాబితాలోకి టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ, శృంగార తార సన్నీలియోన్ కూడా చేరారు.

సల్లూ భాయ్‌కి టాప్ రేటింగ్
సల్మాన్ ఖాన్ బీయింగ్ ఇన్ టచ్ అనే యాప్ తో అభిమానులకు చేరువగా ఉంటున్నాడు. సినిమా విషయాలు మాత్రమే కాకుండా హెల్త్, ఫిట్ నెస్ కు సంబందించిన వివిధ విషయాలని ఈ యాప్ ద్వారా సల్మాన్ ఖాన్ అభిమానులతో పంచుకుంటుంటాడు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. వినియోగదారులు ఈ యాప్ కు 4.9 రేటింగ్ ఇస్తున్నారు.

బాలీవుడ్ భామలు
బాలీవడ్ స్టార్ హీరోయిన్లు సోనమ్ కపూర్, అలియా భట్, దిశా పాటని లాంటి హీరోయిన్లంతా యాప్ లతో అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. దిశా పటాని ఇటీవలే తన యాప్ లాంచ్ చేసింది. సోనమ్, అలియా భట్ ఈ యాప్స్ ద్వారా ఫ్యాషన్ టిప్స్ ని అభిమానులకు అందిస్తున్నారు.

సన్నీలియోన్‌ని కలుసుకునేలా
శృంగార తారగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సన్నీలియోన్ ఇక్కడ కూడా సంచలనాల మోత మోగిస్తోంది. స్టార్ హీరోలు, హీరోయిన్ల కంటే తానే తక్కువేం కాదని సన్నీ కూడా ఓ మొబైల్ యాప్ ని ప్రారంభించింది. ఈ యాప్ 4.6 రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ యాప్ ద్వారా వివిధ పోటీలు నిర్వహిస్తూ విజేతలకు తనని కలుసుకునే అవకాశం కల్పిస్తోంది ఈ భామ. తద్వారా ఆడియన్ మరింత క్రేజ్ సొంతం చేసుకుంటోంది.

విజయ్ దేవరకొండ మరింత జోరు
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా ఈ ట్రెండ్ ఫాలో అయిపోతున్నాడు. ఇటీవల విజయ్ దేవరకొండ తన అభిమానుల కోసం రౌడీ అనే యాప్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండకు ఊహించని క్రేజ్ ఏర్పడింది. తనని అభిమానించే వారికీ చేరువగా ఉండాలని విజయ్ యాప్ లాంచ్ చేశాడు.


Click it and Unblock the Notifications











