ప్రభాస్‌ను దాటేసిన విజయ్ దేవరకొండ.. దిగజారిన మహేష్, రానా.. వీరికి అనామకుడి షాక్..

By Rajababu

Recommended Video

అందర్నీ వెనక్కి నెట్టేసిన విజయ్ దేవరకొండ...!

హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2017 ర్యాంకుల జాబితాలో అర్జున్‌రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ దూసుకెళ్లాడు. విజయ్ తర్వాత స్థానంలో ప్రభాస్ ఉండటం గమనార్హం. అయితే ఇండియన్ ఫిట్‌నెస్ మోడల్, టెలివిజన్ నటుడు బాసీర్ ఆలీ అగ్రస్థానంలో నిలిచి ఈ ఇద్దరి హీరోలకు షాకివ్వడం ఈ జాబితాలో చెప్పుకోదగిన అంశంగా నిలిచింది.

అగ్రస్థానంలో విజయ్ దేవరకొండ

అగ్రస్థానంలో విజయ్ దేవరకొండ

సినీ హీరోలకు సంబంధించిన వరకు విజయ్ దేవరకొండ మొదటిస్థానంలో నిలిచాడు. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాల్లో కేర్‌ఫ్రీ యాటిట్యూడ్‌తో దుమ్మురేపిన విజయ్ మంచి ర్యాంకును సొంతం చేసుకొన్నాడు. గతేడాది విజయ్ ర్యాంకు 20.

 మెరుగుపడిన ప్రభాస్ ర్యాంక్

మెరుగుపడిన ప్రభాస్ ర్యాంక్

బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన ప్రభాస్ రెండోస్థానంలో నిలిచాడు. గతేడాది ప్రభాస్‌ ర్యాంక్ 6. ప్రస్తుతం సాహో షూటింగ్‌లో ప్రభాస్ బిజీగా ఉన్నారు.

 దిగజారిన మహేష్

దిగజారిన మహేష్

ఇక మహేష్ నాలుగోస్థానంలో నిలిచాడు. 2016లో ఆయన ర్యాంక్ 2 గతేడాది వరుస ఫ్లాపుల కారణంగా ఆయన క్రేజ్‌ మసకబారిందనే అభిప్రాయం వ్యక్తమైనట్టు కనిపిస్తున్నది.

ఎగబాకిన రాంచరణ్

ఎగబాకిన రాంచరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 5వ స్థానంలో నిలిచాడు. నిర్మాతగా, వ్యాపారవేత్తగా మారిన చెర్రీ తన లభించిన క్రేజ్‌తో పైకి ఎగబాకాడు. చెర్రీ నటించిన రంగస్థలం చిత్రంలో మార్చి 30న రిలీజ్ కానున్నది. గతేడాది చెర్రీ ర్యాంక్ 14.

బన్నీ ర్యాంక్ బెటర్

బన్నీ ర్యాంక్ బెటర్

గతేడాది డీజేతో దుమ్మురేపిన అల్లు అర్జున్ తన స్థానాన్ని మెరుగుపరుచుకొన్నాడు. గతేడాది ఆయనకు 8 ర్యాంక్ లభించింది. ప్రస్తుతం ఆయన ర్యాంకు 6. బన్నీ నటించిన నా పేరు సూర్య చిత్రం ఏప్రిల్ మొదటివారంలో రిలీజ్ కానున్నది.

 రానా తడబాటు..

రానా తడబాటు..

విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న రానా దగ్గుబాటి 7వ స్థానంలో నిలిచారు. గతేడాదితో పోల్చుకొంటే రానా ర్యాంక్ దిగజారినట్టు టైమ్స్ సంకేతమిచ్చింది. 2016లో రానా ర్యాంకు 4

ఎన్టీఆర్‌కు చేజారిన ర్యాంక్

ఎన్టీఆర్‌కు చేజారిన ర్యాంక్

టాలీవుడ్‌ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 9వ స్థానంలో నిలిచాడు. గత సంవత్సరం ఎన్టీఆర్ ర్యాంక్ 5 కావడం గమనార్హం. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ రూపొందించే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నాడు.

 పడిపోయిన నాని

పడిపోయిన నాని

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నానికి ఈ ఏడాది ర్యాంకుల పట్టికలో 10 స్థానంలో నిలిచాడు. ఆయనకు గతేడాది లభించిన ర్యాంకు 3.

అక్కడక్కడే రామ్

అక్కడక్కడే రామ్

హీరో రామ్‌ 11 స్థానంలో నిలిచాడు. గతేడాది రామ్‌కు 12వ స్థానం లభించింది. ఆయన స్థానంలో పెద్దగా మార్పు ఏమీ కనిపించలేదు.

 12వ స్థానానికి చైతూ

12వ స్థానానికి చైతూ

అక్కినేని నాగచైతన్యకు ఈసారి ర్యాంకు తగ్గింది. గతేడాది 7వ ర్యాంకును సొంతం చేసుకొన్న ఆయన ఈ ఏడాది 12వ స్థానానికి పరిమితమయ్యాడు. ప్రస్తుతం చైతూ సవ్యసాచి చిత్రంలో నటిస్తున్నాడు.

 ఎదిగిన అఖిల్ అక్కినేని

ఎదిగిన అఖిల్ అక్కినేని

అక్కినేని అఖిల్ ప్రస్తుతం 13వ స్థానంలో నిలిచాడు. గతేడాది 19వ స్థానంలో ఉన్నారు. గతేడాది ఆయన నటించిన హలో చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X